Pawan Kalyan Meet Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు, పవన్ చర్చిస్తున్నారు. తెలుగుదేశం-జనసేన-బీజేపీ సీట్ల సర్దుబాటు తర్వాత రెండు పార్టీల నేతలు కొంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మరికొందరి పేర్లు ప్రకటించాల్సి ఉన్న తరుణంలో ఇరు అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
TDP Candidates Finalized: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనలో యమ జోరు మీదున్న టీడీపీ ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించగా ఇక మిగిలిన అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కసరత్తు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తికాగా అధికారిక ప్రకటనే తరువాయి అన్నట్లుగా పార్టీలో పరిస్థితులు కన్పిస్తున్నాయి.
టీడీపీ ప్రకటించాల్సి ఉన్న 16 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల్ని ఇవాళ లేదా రేపట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మొన్ననే ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించాలని చంద్రబాబు భావించారు. అయితే బీజేపీతో సీట్ల సర్దుబాటు చర్చల కారణంగా వాయిదా పడినట్లు సమాచారం.
అధికారిక ప్రకటనే ఆలస్యం - టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే!
- శ్రీకాకుళం - కె. రామ్మోహన్ నాయుడు
- విశాఖ - ఎం. భరత్
- అమలాపురం - గంటి హరీష్
- విజయవాడ - కేశినేని శివనాథ్ (చిన్ని)
- గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
- నరసరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయులు
- ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి/ రాఘవరెడ్డి
- నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్
- అనంతపురం - బీకే పార్థసారధి
- నంద్యాల- బైరెడ్డి శబరి