Tanker Crew Strike in Scindia Visakhapatnam :విశాఖ సింధియా హెచ్‌పీసీఎల్ (HPCL) బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదుగురు యువకులు టెర్మినల్ వద్ద మద్యం తాగుతుండగా రఫీ అనే డ్రైవర్ అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహించిన యువకులు డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం తోటి డ్రైవర్లు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఘటనకు పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. దాడికి నిరసనగా పెద్ద ఎత్తున ట్యాంకర్ల సిబ్బంది సమ్మె చేపట్టారు. దీంతో ఇంధన రవాణా నిలిచిపోయింది. రవాణా నిలిచిన నేపథ్యంలో పోలీసుల చర్యలు తీసుకున్నారు. ఈ దాడిలో పాల్గొన్న యువకుల్లో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్రను పోలీసులు అరెస్టు చేసి సస్పెండ్ చేశారు.