ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధి వెక్కిరించినా ఆత్మస్థైర్యంతో ముందుకు దూసుకెళ్తున్న యువకుడు - handicapped person successful story

Talented Handicapped Person Winning Medals in Para Athletics : దేశానికి సేవ చేయాలనేది ఆ యువకుడి చిన్ననాటి కల. ఆందుకోసం ఆహర్నిశలు శ్రమించి ఆర్మీ జనానుగా ఎంపికై శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు. అంతా సాఫీగానే సాగుతుంది అనుకునే లోపే విధి అతన్ని వెక్కిరించింది. దేశ సేవ సంగతి అంటుంచితే ఒక కాలుపోయి సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్నాడు. సీన్ కట్‌ చేస్తే దేశానికి సేవ చేసే భాగ్యం కోల్పోయినా పేరు తెచ్చే సత్తా తనలో ఉందనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఈ మాటలన్నీ వింటుంటే ఆ యువకుడి కథేంటో తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే వెంటనే ఈ స్టోరీని చూడండి.

Talented Handicapped Person Winning Medals in Para Athletics
Talented Handicapped Person Winning Medals in Para Athletics (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 5:23 PM IST

విధి వెక్కిరించింది వెనక్కి తగ్గలేదు - ఆత్మస్థైర్యంతో జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న దివ్యాంగ యువకుడు (ETV Bharat)

Talented Handicapped Person Winning Medals in Para Athletics : జీవితమనే ప్రయాణంలో సమస్యలు, ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇదే ఆలోచనతో తన ప్రయాణాన్ని మళ్లీ మొదలు పెట్టాడు ఓ యువకుడు. రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా తనలోకి అధైర్యాన్ని మాత్రం దరిచేరనీయలేదు. మనసుంటే మార్గముంటుందని మరోసారి గుర్తు చేస్తూ పారా అథ్లెట్‌గా పతకాలు సాధిస్తున్నాడు.

అనంతపురం జిల్లా కందకూరు చెందిన నిరుపేద కుటుంబంలో సాకే బాబు జన్మించాడు. తల్లిదండ్రులు రమేశ్‌, లక్ష్మమ్మలు చిన్నచితక పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. కుటుంబ పరిస్థితులను కళ్లారా చూసిన బాబు ఎలాగైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్నాడు. 2014లో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఒలంపిక్స్​లో పసిడి పతకమే లక్ష్యం - పవర్‌లిఫ్టింగ్‌లో ​గుంటూరు యువ క్రీడాకారుడు సత్తా

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనేది సాకే బాబు చిన్ననాటి కళ. అందుకోసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్ పరీక్ష రాసి బీఎస్​ఎఫ్ జవానుగా ఎంపికయ్యాడు. దీంతో ఈ యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మూడు నెలలు ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ తీసుకున్నాడు. అంతలోనే బాబుని విధి వెక్కిరించింది. శిక్షణ అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా రైలు ప్రమాదం జరిగి తన ఎడమ కాలును పూర్తిగా కోల్పోయాడు.

కాలు కోల్పోవడంతో కొంత కాలం మనోవేదనకు గురయ్యాడు బాబు. కానీ, ఏనాడు జీవితం మీద ఆశ మాత్రం కోల్పోలేదు. సీఐఎస్​ఫ్ , బీఎస్​ఎఫ్, సీఆర్​ఫీఎఫ్ బలగాల్లో ప్రమాదాలకు గురైన సైనికులకు ఆదిత్య మోహతా ఫౌండేషన్‌ కృత్రిమ అవయవాలు అమర్చడానికి సహాయం చేస్తున్నారని తెలుసుకున్నాడు. 2019లో ఫౌండేషన్‌ను సంప్రదించగా పరీక్షలు చేసి కృత్రిమ కాలును అమర్చారని ఈ యువకుడు చెబుతున్నాడు.

అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు

"అవయవాలు కోల్పోయిన సైనికులకు ఆదిత్య మోహిత ఫౌండేషన్‌ డిస్క్‌ త్రో, షాట్‌ పుట్‌ క్రీడల్లో శిక్షణ ఇచ్చారు. దీంట్లో పాల్గొని ఏడాదిన్నర పాటు తర్ఫీదు పొందాను. 2021లో తొలిసారి రాష్ట్రస్థాయి ఎఫ్‌-56 విభాగంలో బంగారు పతకం సాధించాను. ఈ ఏడాది గోవాలో జరిగిన జాతీయస్థాయి పారా అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాను. జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాను. ఆర్​డీఐ(RDI) సంస్థ ప్రోత్సహంతో జిమ్‌లో ఉచితంగా వ్యాయామం చేస్తున్నాను. ఆదిత్య మోహతా ఫౌండేషన్‌ వాళ్లు చేసిన సహకారంతో జీవితాన్ని మళ్లీ ప్రారంభించాను. పారా ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం." - సాకే బాబు, పారా అథ్లెటిక్ క్రీడాకారుడు

"వైకల్యాన్ని అధిగమించి పారా అథ్లెట్‌గా రాణిస్తున్న నా కుమారుడిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినప్పడు చాలా బాధపడ్డాము. ఆ బాధను నుంచి తెరుకుని పారా అథ్లెటిక్స్‌లో పతకాలు సాధిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. విధి వెంటాడినా వాటికి ఎదురు నిలిచి నా కుమారుడు పోరాడుతున్నాడు. ప్రమాదంలో కాలు కోల్పోయినా ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు. ప్రపంచ స్థాయి క్రీడల్లో పాల్గొనడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నాడు." - సాకే రమేష్, బాబు తండ్రి

ఇడ్లీ, దోశ, ఉప్మా - అక్కడ రూ.10కే టిఫిన్‌ - ఇంటి రుచికి ఏమాత్రం తీసిపోదు!

ప్రపంచ స్థాయి క్రీడల్లో పాల్గొనాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడో ఒకచోట పాల్గొని ఉండాలనే ఉందని బాబు చెప్పారు. దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రీడలకు ఎంపిక చేసేందుకు జరిగే పరీక్ష మార్చిలో బెంగుళూరులో జరిగింది. దీనిలో పాల్గొనేవారు ముప్పై వేల రూపాయలు ప్రవేశ రుసుం చెల్లించాలి. అయితే ఈ రుసుం చెల్లించే స్తోమత లేక పాల్గొనలేకపోయాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన సాకే బాబు ప్రమాదం జరిగిన తరువాత ఆర్థికంగా బాగా చితికిపోయాడు. దీంతో ప్రతిభ ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో బెంగుళూరు, భువనేశ్వర్, పూనే, గోవాల్లో జరిగిన క్రీడల్లో పాల్గొన్న సాకే బాబు కొంత అప్పుచేసి వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బెంగుళూరులో ప్రపంచ స్థాయి క్రీడా ఎంపిక పరీక్షలో ముప్పై వేలు చెల్లించే స్తోమత లేక పాల్గొనలేదు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను ప్రపంచ స్థాయి పారా అథ్లెటిక్స్ డిస్కో త్రో, షాట్ పుట్ క్రీడల్లో పాల్గొని విజయం సాధిస్తానని సాకే బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన ప్రతిభ నిరూపించుకోటానికి దాతలు ముందుకువచ్చి ఆర్థిక చేయూత అందిస్తే ఏ స్థాయి క్రీడల్లో పాల్గొన్నా తాను విజయం సాధిస్తానని బాబు చెబుతున్నారు.

జీఎంఆర్‌ ఐటీ వేదికగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details