Supreme Court on Attack of Chandrababu House and TDP Office Case:చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జోగి రమేష్, దేవినేని అవినాష్ వేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం దేవినేని అవినాష్, జోగి రమేశ్ సహా 20 మందికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జోగి రమేష్, దేవినేని అవినాష్ దర్యాప్తునకు సహకరించాలని, అలానే దేశం వదిలి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నిందితులకు తప్పు చేశామని తెలుసు:ఈ కేసులో మూడేళ్లు దర్యాప్తు జరపకుండా తాత్సారం చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తిగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించారని మండిపడింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు కారణాలు కనిపించలేదని, హైకోర్టు ఉత్తర్వులపై నిందితులు పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం తరుపున వాదించిన న్యాయవాదులు నిందితులు మూడేళ్లుగా బెయిల్, ముందస్తు బెయిల్ కోరలేదని ధర్మాసనానికి తెలిపారు.