ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా మాటే వినరా అంటూ' ఓ ప్రిన్సిపల్ నిర్వాకం - విద్యార్థినులతో రోజుకు 100కు పైగా గుంజీలు - Rampachodavaram Principal Issue - RAMPACHODAVARAM PRINCIPAL ISSUE

Students Sick After Sit ups in Rampachodavaram : విద్యార్థులను తమ సొంత పిల్లల వలే భావించి గురువులు విద్యాబుద్ధులు నేర్పిస్తారు. వారు ఏదైనా తప్పు చేస్తే వారిని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ ప్రిన్సిపల్ తన మాట వినడం లేదనే కారణంతో విద్యార్థినుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించింది. క్రమశిక్షణ పేరుతో వారికి దండన విధించింది. ఈ ఘటన అల్లూరి సీతరామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.

Principal Brutally Punishment to Students
Principal Brutally Punishment to Students (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 9:23 AM IST

Rampachodavaram Principal Punished to Students :విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలతో పాటు సరైనా విద్యాబుద్ధులను నేర్పుతున్న గురువులను చూసే ఉంటాం. పిల్లలను తమ సొంత బిడ్డలవలే భావించి వారి ఉన్నతి కోసం పాటు పడిన వారిని చూసే ఉంటాం. కానీ ఓ ప్రిన్సిపల్ విద్యార్థినులు తన మాట వినడం లేదని ఆగ్రహానికి గురైంది. దీంతో వారిని క్రమశిక్షణ పేరుతో శిక్షించింది. ఏకంగా మూడు రోజుల పాటు అమ్మాయిలకు గుంజీల దండన విధించింది.

ఈ క్రమంలోనే నాలుగో రోజున ఆ బాలికలు ఇక తట్టుకోలేక అస్వస్థతకు గురవడంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో జరిగింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు తాము చెప్పిన మాట వినడం లేదని ప్రిన్సిపల్‌ ప్రసూన, పీడీ కృష్ణకుమారి భావించారు. ఇందుకు శుక్రవారం నుంచి వారితో రోజుకు 100 నుంచి 200 వరకు గుంజీలు తీయించారు. ఇలా మూడు రోజుల నుంచి జరుగుతోంది.

సోమవారం కూడా అలాగే చేయడంతో 50 మంది వరకు విద్యార్థినులు కాళ్ల నొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వెంటనే కళాశాలకు చేరుకుని విద్యార్థినులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సాయంత్రానికి కోలుకున్న వారిలో కొందరిని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ చేశారు. ఈ ఘటనపై బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్​పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశం : ఈ ఘటనపై ఎమ్మెల్యే మిరియాల శిరిషాదేవి స్పందించారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థినులను గుంజీలు తీయించడం దారుణమైన చర్యని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి సూచించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆమె సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. ‘ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులూ రావడం లేదు. నా సొంత డబ్బుతో మీ అందరికీ భోజనం పెడుతున్నాను’ అని ప్రిన్సిపల్‌ అంటున్నట్లు బాలికలంతా మిరియాల శిరిషాదేవి ఎదుట ఆవేదనకు లోనయ్యారు. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని వారికి ఎమ్మెల్యే భరోసానిచ్చారు.

మదర్సా విద్యార్థులను చితకబాదిన టీచర్​... అన్నం పెట్టకుండా..

Drunken Teacher Beat Students: బడికి తాగి వచ్చిన మాష్టారు.. విద్యార్థుల రక్తం కళ్లజూశాడు!

ABOUT THE AUTHOR

...view details