Student Suicide At Basara IIIT : బాసర ఆర్జీయూకేటీలో విషాదం చోటుచేసుకుంది. ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) రెండో సంవత్సరం చదువుతున్న బచ్చుక అరవింద్ తను ఉండే హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య(Inter Student Suicide t IIIT Nirmal) చేసుకున్నాడు. మృతుడు సిద్దిపేట జిల్లా తోగూట మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం : గత వారం ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల నిమిత్తం ఈ నెల 12వ తేదీన తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చాడు. ఏం అయిందో తెలియదు. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. వెంటనే అక్కడే ఉన్న విద్యార్థులు హాస్టల్ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆర్టీయూకేటీ( Basara IIIT)కి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి శవపంచనామ కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Inter Student Suicide in Hyderabad : ''సారీ అమ్మానాన్న'.. ఇదే నా చివరి రోజు ఇక నేను వెళ్తున్నా..'
Basara IIIT Student Died :ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ నెల 18 నుంచి పరీక్షలు రాయాల్సిన అరవింద్ అర్ధాంతరంగా ఇలా బలవన్మరణం చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. కాగా అదనపు బాధ్యతలతో ఆర్జీయూకేటీ ఇంఛార్జి వీసీగా నియమితులైన వెంకటరమణ, ప్రత్యేకాధికారి సృజన బాధ్యతల రీత్యా హైదరాబాద్‌లో ఉండటంతో బాసర ఆర్జీయూకేటీలో పాలన గాడి తప్పింది.
Basara IIIT Student Suicide News :అధికారుల పర్యవేక్షణ కొరవడటం, విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. చదివి ప్రయోజకులు కావాల్సిన విద్యార్థులు ఇలా ఆత్మహత్యల వైపు మనసు మళ్లకుండా కౌన్సెలింగ్ చేయాల్సిన వ్యవస్థ ఆర్టీయూకేటీలో అమలు కావడం లేదని తెలుస్తోంది. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చదువుల విషయంలో ఒత్తిడికి గురై, తల్లిదండ్రులు మందలించారని, ప్రేమలో విఫలమయ్యారని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుని కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు.
ధర్మవరంలో దారుణం - పరీక్షలు రాయమన్నందుకు ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
పగ తీర్చుకునేందుకు 9ఏళ్ల బాలుడి హత్య- వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య