తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకే గుడ్డు నుంచి 2 కోడి పిల్లలు - నుదుటన ముక్కుతో మేక - ఈ వింతలు మీరు చూశారా? - STRANGE INCIDENT

వేర్వేరు చోట్ల వింత ఘటనలు - ఒకే కోడి గుడ్డులో రెండు పిల్లలు - తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో పుట్టిన ఓ మేక

STRANGE TWO CHICKS IN ONE EGG
Strange Two Chicks in one Hen Egg (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2024, 7:24 AM IST

Updated : Dec 24, 2024, 8:47 AM IST

Strange Two Chicks in one Hen Egg : ప్రపంచంలో వింత ఘటనలెన్నో జరుగుతుంటాయి. అరుదుగా జరిగే ఆ వింతలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సొనాల గ్రామంలో అరుదైన ఘటన జరిగింది. ఓ కోడి గుడ్డు పెట్టగా, అందులో నుంచి ఏకంగా రెండు కోడి పిల్లలు బయటకు వచ్చాయి. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన షేక్ తోఫిక్ కోళ్లను పెంచుతుంటారు. అయితే ఆయన తన కోళ్ల కోడిగుడ్లను పొదిగించగా, ఈ నెల 23న ఒక గుడ్డులో నుంచి రెండు పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన షేక్ తోఫిక్, ఆ రెండు పిల్లలను పరిశీలించగా అవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి.

ఒక గుడ్డులోనుంచి పుట్టిన రెండు కోడి పిల్లలు (ETV Bharat)

ఒక్క కోడి గుడ్డులో రెండు కోడి పిల్లలు పుట్టిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారందరూ వాటిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే ఈ వింత ఘటనపై సొనాల ఇన్​ఛార్జి పశు వైద్యాధికారి సుశీల్ కుమార్​ను సంప్రదించగా, జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తాయని వివరించారు. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు సైతం కోడికి కవలలు పుట్టాయి అంటూ వింత ఘటనను పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో పుట్టిన మేక పిల్ల (ETV Bharat)

తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో ఓ మేక పిల్ల :మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఓ ఘటన వెలుగు చూసింది. ఈ నెల 22న ఓ వింత మేక పిల్ల జన్మించింది. జిల్లాలోని ఎడపల్లి మండలంలోని మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన రామరాజుకు చెందిన ఓ మేక ఆదివారం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఒక మేక పిల్ల తల భాగంలో కళ్లు, నుదుటి భాగంలో ముక్కుతో పుట్టింది. దీంతో అక్కడున్న గ్రామస్థులు ఈ వింత మేకను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై ఓ పశు వైద్యాధికారిని సంప్రదించగా, జన్యు లోపంతో మేక పిల్ల అలా పుట్టిందని తెలిపారు.

Two Headed Goat Suryapet : రెండు తలలున్న మేకను చూశారా.. ఇదిగో ఈ వీడియో చూసేయండి

వింత ఘటన.. ఆరు కాళ్లతో గొర్రెపిల్ల జననం

Last Updated : Dec 24, 2024, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details