State Dam Safety Officers Inspects Barrages : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం మంగళవారం పరిశీలించింది. ముందుగా అన్నారం బ్యారేజీలోని సీపేజీ బుంగలను చూశారు. బ్లాక్ నంబర్ నాలుగులోని 38, 39 పియర్ల మధ్య ఉన్న వెంట్ వద్ద ఏర్పడిన కొత్త బుంగల్ని పరిశీలించారు. గత ఏడాది ఏర్పడ బుంగల పరిస్థితిపైనా ఆరా తీశారు. బుంగలు ఏర్పడిన చోట గ్రౌటింగ్ చేశామని సీఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ యాదగిరి రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందానికి వివరించారు. పూర్తిస్థాయిలో లీకేజీని నియంత్రించామని అధికారులు తెలిపారు.
Annaram Barrage Damage Issue Updates : సీపేజీ బుంగల మరమ్మతుకు ఏయే రసాయన పదార్థాలను వినియోగించారు, ఎన్నిసార్లు వాడారని ఇంజినీరింగ్ అధికారులను డ్యాం సేఫ్టీ బృందం ప్రశ్నించింది. నీటి వెలాసిటీ, గేట్ల పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వెంట్ వద్ద వేసిన ప్లాట్ ఫామ్ పూర్తిగా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యారేజీకి (Annaram Barrage) సంబంధించి గేట్ల కింది భాగంలో సిమెంట్ పెచ్చులు ఊడిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. 66 గేట్లకు గాను 42 పిల్లర్ల వద్ద సిమెంట్ పెచ్చులు ఊడినట్లు ఇంజినీరింగ్ అధికారులు వారికి వివరించారు.
రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీరు అందలేదు : సీఎం రేవంత్ రెడ్డి
ఏడో పియర్‌ను పరిశీలించిన బృందం :అన్నారం బ్యారేజీ తర్వాత మేడిగడ్డకు వెళ్లిన రాష్ట్ర డ్యాం సేఫ్టీ బృందం ఏడో బ్లాక్‌లో దెబ్బతిని కుంగిన ప్రాంతాన్ని పరిశీలించింది. కాలినడకన వెళ్తూ పరీక్షించింది. ఆనకట్ట మీద నుంచి కుంగిన పియర్లు, దెబ్బతిన్న గేట్ల పరిస్థితిని చూశారు. మేడిగడ్డ దిగువకు వెళ్లి బ్లాక్ నంబర్ ఏడులోని పియర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పియర్ చీలిక, తెగిన ఇనుప చువ్వలు, పగుళ్లు, గేటును పరిశీలన చేశారు.