Sahithi Infra Real Estate Scam :ప్రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడిన సాహితీ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థను రాష్ట్ర వినియోగాదారుల కమిషన్ తప్పుపట్టింది. కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత స్పందించకపోవడాన్ని తీవ్రంగా మండిపడింది. సకాలంలో ప్లాట్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి మొత్తం సొమ్ము వసూలు చేశాక నిర్మాణం చేపట్టకపోవడం, దీనిపై నోటీసు ఇచ్చినా స్పందించని సాహితీ ఇన్‌ఫ్రా సంస్థది సేవా లోపమని, అనైతిక వ్యాపారమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ పేర్కొంది.
సీసీఎస్ ఎదుట సాహితీ ఇన్‌ఫ్రా బాధితుల ధర్నా - లక్ష్మీనారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ - Sahiti Infra Victims Protest at CCS
సాహితీ ఇన్‌ఫ్రా చేపట్టిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారి నుంచి కష్టార్జితాన్ని వసూలు చేసి, వారి నోటీసులపై స్పందించకపోవడాన్ని తప్పుబట్టింది. ఇది కేవలం ఆర్థిక నష్టమేకాకుండా సొంతింటి కలను చెరిపివేయడంతో మానసిక వేదనకు గురి చేసిందని పేర్కొంది. ప్లాట్ల కొనుగోలుదారులు చెల్లించిన సొమ్మును వడ్డీతో పాటు సరిహారం ఖర్చులు చెల్లించాలంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ మూడు వేర్వేరు పిటిషన్లలో తీర్పు వెలువరించింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం ప్రగతినగర్‌లో సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన, సాహితీ అనంద్ ఫార్చ్యూన్‌లో ఫ్రీలాంచ్ కింద 51 లక్షలకు పైగా చెల్లించి 2021లో ఫ్లాట్‌ను కొనుగోలు చేయగా నిర్మాణం చేపట్టడంగానీ, సొమ్ము వాపసు ఇవ్వడంగానీ చేయకపోవడంతో గుంటూరు జిల్లాకు చెందిన వెంకటసత్య సునీల్‌కుమార్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీనిపై రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సభ్యులు కె.రంగారావు. ఆర్.ఎస్.రాజేశ్రీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. గడువులోగా నిర్మాణం చేపట్టకపోవడంతో పాటు లీగల్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడం అనైతిక వ్యాపారమేనని పేర్కొంది. పిటిషనర్ చెల్లించిన డబ్బులకు 12 శాతం వడ్డీతో వాపసు ఇవ్వాలని సాహితీ ఇన్‌ఫ్రాను ఆదేశించింది. అంతేగాకుండా మానసిక వేదనకు గురి చేసినందున మరో లక్ష పరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ మరో 50 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన పుష్పలతకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రీ లాంచ్ పేరుతో రూ.1164 కోట్లు వసూలు - సాహితీ ఇన్‌ఫ్రాపై 50 కేసులు నమోదు
Telangana HC on sahiti infra case: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు