ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగరంగ వైభవంగా రంగనాథ స్వామి రథోత్సవం- శ్రీదేవీ భూదేవి సమేతంగా భక్తులకు దర్శనం - Talpagiri Ranganatha Swamy

Sri Talpagiri Ranganatha Swamy Rathotsavam in Nellore District : నెల్లూరు జిల్లాలో రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి రథోత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. మొక్కులు తీర్చకుంటూ స్వామి వారి సేవలో తరించారు.

ranganatha_swamy_rathotsavam
ranganatha_swamy_rathotsavam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 6:39 PM IST

Sri Talpagiri Ranganatha Swamy Rathotsavam in Nellore District :నెల్లూరులో వెలిసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కల్యాణమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి భారీ రథంపై రంగనాయకులపేట పురవీధుల్లో విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా స్వామివారికి హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, రథంపై ఉప్పు, మిరియాలు చల్లుతూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకు రథోత్సవాన్ని, రాత్రి 9 గంటలకు పొన్నవాహన ఉత్సవం జరగనున్నాయి.

శ్రీకాళహస్తిలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు: రావణబ్రహ్మ వాహనంపై సోమస్కందమూర్తి

Ranganatha Swamy Rathotsavam : రంగనాథుని జయజయ ధ్వనుల మధ్య నాలుగుకాళ్ల మండపం వరకు రథోత్సవం సాగింది. అనంతరం అక్కడ వేచి ఉన్న నరసింహకొండ నరసింహస్వామి రంగనాథునికి పట్టువస్త్రాలు సమర్పించి, సంప్రదాయబద్ధంగా సాగుతున్న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవాలకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కళాకారుల నృత్యాలు, డప్పులతో రథోత్సవాలు ఘనంగా జరిపించారు. రథోత్సవం సందర్భంగా పలువురు దాతలు ప్రసాదాలు, శీతల పానియాలు పంపిణీ చెయ్యడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. పోలీసులు భక్తులకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశారు.

అంగరంగ వైభవంగా రంగనాథ స్వామి రథోత్సవం - శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనం
మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం- మేళతాళాలతో స్వామివారి ఊరేగింపు

Nellore District :నెల్లూరు రంగ నాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. టీటీడీ తరపున అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. కార్యక్రమాలకు విద్యాసాగర్​, గోపాలకృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, నాగరాజరావు ఉభయకర్తలుగా వ్యవహరించారు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి రంగనాథస్వామికి బంగారు గరుడసేవ నిర్వహించారు. ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. సిద్ధవరపు శివకుమార్​ రెడ్డి, సనాతన ఉభయకర్తలుగా వ్యవహరించారు. నగరంలో శ్రీకృష్టచరిత మాసన ప్రచారమండలి ఆధ్వర్యంలో నూతన గొడుగులను స్వామికి సమర్పించారు.

కన్నుల పండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం

ABOUT THE AUTHOR

...view details