ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సర్వం కృష్ణమయం - ఊరూవాడ కనుల పండువలా జన్మాష్టమి వేడుకలు - KRISHNASHTAMI CELEBRATIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 11:02 AM IST

Sri Krishna Janmashtami Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఊరూవాడ కనుల పండువలా నిర్వహించారు. శ్రీ కృష్ణ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు, యువతుల సంస్కృతిక కార్యక్రమాలు చూపారులను ఆకట్టుకున్నాయి.

krishnashtami_celebrations
krishnashtami_celebrations (ETV Bharat)

Sri Krishna Janmashtami Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా కృష్ణాష్టమిని వైభవంగా జరుపుకున్నారు. ఉట్టికొట్టి చిన్నాపెద్ద సందడి చేశారు. పలుచోట్ల చిన్నారులు..గోపాలుడు, గోపికమ్మల వేషధారణలతో అలరించారు. ఇస్కాన్‌ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమతత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు ఉండేలా ప్రత్యేక పూజలు చేశారు.

Vijayawada :ఊరూవాడా కృష్ణాష్టమి వేడుకలు సందడిగా సాగాయి. విజయవాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఈవో రామారావు, సీపీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఈవో ఉట్టికొట్టారు. విజయవాడ రూరల్ మండలం గూడవల్లి, ప్రసాదంపాడు, రామవరప్పాడులో శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నంద గోపాలుడి సంబరాలతో తాడిగడపలోని శ్రీకృష్ణ రెసిడెన్సీలో సందడి నెలకొంది. కన్నయ్య గీతాలకు యువతుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

కనులవిందుగా కన్నయ్య పండుగ - భక్తిపారవశ్యంలో ప్రజలు - Janmashtami Celebrations in AP

Ambedkar Konaseema District :అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముమ్మివరంలో యువతీయువకులు ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ శ్రీసత్య సాయి విద్యా విహార్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు విశేష ఆలంకరణతో సందడి చేశారు. కృష్ణుడి జననం నుంచి వివిధ ఘట్టాలు వీక్షకులను కట్టిపడేశాయి. సాగర్ నగర్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణల పోటీలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ముద్దులొలికారు. వేదికపై రాంప్ వాక్ చేశారు.

కృష్ణాష్టమి స్పెషల్- కిట్టయ్య లీలల వెనుక అసలు సంగతేంటో తెలుసా? - Sri Krishna Ashtami 2024

Palnadu District : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కృష్ణాష్టమి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో కలిసి కోలాటం ఆడారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్లలో వేడుకలకు మంత్రి పార్థసారథి, ఎంపీ మహేష్‌యాదవ్‌ హాజరై చిన్నారులతో సందడి చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తిలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని గ్రామస్థులు ఆనందోత్సవంతో నిర్వహించారు. అనంతపురంలోని ఇస్కాన్ మందిరంలో రాధాకృష్ణ ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు.

మోక్షం ప్రసాదించే 'శ్రీ కృష్ణాష్టమి పూజ'- ఈ విధంగా చేస్తే సకల పాపాలు దూరం! - Krishna Janmashtami 2024

ABOUT THE AUTHOR

...view details