Speaker Ayyanna Patrudu on MLA Jagan :అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని, మైక్ ఇస్తే కట్ చేస్తారని, ఎమ్మెల్యేలాగా రెండు నిమిషాలు మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లడం ఎందుకని ఎమ్మెల్యే జగన్ అన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై బీఏసీ మీటింగ్‌లో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు :జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ నెల 22వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతారయని, అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ నిర్వహిస్తామని అన్నారు. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు స్పీకర్ తెలిపారు.
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవాలని 39 శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల గురించి తెలుసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఎమ్మెల్యేలు బడ్జెట్ పై అధ్యయనం చేసి సభలో చర్చించాలన్నారు. దీనిపై రేపు బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు తమ వెంట అనుచరుల్నిఅసెంబ్లీకి తీసుకుని రావటం మానుకోవాలని హితవు పలికారు.
అసెంబ్లీ మీద అలగడానికి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదు : షర్మిల