ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపత్రి ఘటనపై డీఎస్పీని మందలించిన ఎస్పీ - అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశం - SP Reprimanded DSP Chaitanya

SP Reprimanded DSP Chaitanya Over Tadipatri Incident: తాడిపత్రిలో అర్థరాత్రి జేసీ ఇంటిపైకి వెళ్లి పనివాళ్లను పోలీసులు విచక్షణరహితంగా కొట్టడంపై అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ చైతన్య పిలిచి గట్టిగా మందలించారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి స్పెషల్ డ్యూటీపై వచ్చి గొడవ మరింత పెంచారని మండిపడినట్లు సమాచారం. ఈ ఘటనపై డీఎస్పీ నుంచి వివరణ తీసుకున్నట్లు తెలిసింది.

sp_reprimanded_dsp_chaitanya
sp_reprimanded_dsp_chaitanya (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 10:42 PM IST

SP Reprimanded DSP Chaitanya Over Tadipatri Incident:అనంతపురం జిల్లా తాడిపత్రిలో అర్థరాత్రి జేసీ ఇంటిపైకి వెళ్లి పనివాళ్లను పోలీసులు విచక్షణరహితంగా కొట్టడంపై అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ (Anantapur District SP Amit Bardar) ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ చైతన్య పిలిచి గట్టిగా మందలించారు. రెండు రోజులుగా రాళ్లదాడులు, ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసు అధికారులు శాంతియుతంగా అణచివేసే యత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి స్పషల్ డ్యూటీపై తాడిపత్రికి వచ్చిన కొందరు పోలీసు అధికారులు అత్యత్సాహం చూపించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. జేసీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించి పనిమనుషులను చితకబాదారు.

వైఎస్సార్సీపీ దమనకాండ - పులివర్తి నానిపై హత్యాయత్నం - కారంపూడి, తాడిపత్రిలోనూ విధ్వంసం - YSRCP attacks

కంప్యూటర్ ఆపరేటర్ దివ్యాంగుడైన కిరణ్​ను ఇంటినుంతి జూనియర్ కళాశాల మైదానంలోకి తీసుకొచ్చి పోలీసులు తలపగలగొట్టారు. క్రిమినల్స్ తరహాలో వ్యవహరించిన పోలీసులపై తాడిపత్రిలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. డీఎస్పీ చైతన్య (DSP Chaitanya) లాఠీతో తన తలపగులగొట్టాడని బాధితుడైన కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మీడియాతో చెప్పారు. దీనిపై ఉదయం నుంచి మీడియాలో పెద్దఎత్తున వరుస కథనాలు రావడంతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ స్పందించారు. స్పెషల్ డ్యూటీపై రాజంపేట నుంచి తాడిపత్రికి వచ్చిన డీఎస్పీ చైతన్యను అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ పిలిపించి, తెల్లవారు జామున అమాయకులపై దాడిచేసిన సంఘటన సంబంధించి వివరణ తీసుకున్నట్లు సమాచారం.

ఏపీ ఊపిరి పీల్చుకో - పల్నాడులో తీరం దాటిన రాజకీయ తుపాను ! - AP Elections 2024

గతంలో పనిచేసిన తాడిపత్రిలో శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిందికి బదులు, పనిమనుషులు, కంప్యూటర్ ఆపరేటర్​పై దాడులు ఏంటని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. తక్షణమే తాడిపత్రి వదిలి, తిరిగి రాజంపేటకు వెళ్లిపోవాలని డీఎస్పీ చైతన్యను అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించారు. డీఎస్పీ చైతన్య సాయంత్రం అనంతపురం నుంచి నేరుగా రాజంపేటకు వెళ్లిపోయారు. తాడిపత్రిలో పనిచేసిన సమయంలో తీవ్ర వివాదాస్పద డీఎస్పీగా విమర్శలు ఎదుర్కొన్న చైతన్యని ప్రత్యేక డ్యూటీపై ఎవరు పిలిపించారన్న అంశంపై ఎస్పీ అమిత్‌ బర్దర్‌ విచారిస్తున్నట్లు తెలిసింది.

నాటు బాంబులు, పెట్రోల్ సీసాల దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu

ABOUT THE AUTHOR

...view details