Additional Coaches to Secunderabad-Visakha Vandebharath Express:ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా కోచ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా మరో 4 కోచ్‌లను జత చేసింది. అదనపు కోచ్‌లు జనవరి 11 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మరో 4 కోచ్‌లు పెంచడం ద్వారా ప్రస్తుతం 1,128గా ఉన్న సీటింగ్ కెపాసిటీ 1,414కి చేరనుంది.
Sankranti Special Trains: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. కొన్ని ప్రధాన స్టేషన్ల మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అదనంగా నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు నేటి నుంచి (జనవరి 10) 17వ తేదీల మధ్యలో సర్వీసులు నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి చర్లపల్లి మధ్య పలు జన సాధారణ్ రైళ్లను నడపనున్నారు.
ఈ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు చర్లపల్లి నుంచి విశాఖపట్నం స్టేషన్ల మధ్య నేటి నుంచి 17వ తేదీల్లో మొత్తం 16 జన సాధారణ్ రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్- అర్సికెరే (కర్ణాటక), బెంగళూరు - కలబుర్గి స్టేషన్ల మధ్య మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ అదనపు ప్రత్యేక రైళ్లు సర్వీసులందించే తేదీలు, రూట్ల వివరాలు ఇలా ఉన్నాయి.