ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య పోరు పడలేక కన్న తండ్రిని కడతేర్చిన కొడుకు - SON THROWS FATHER INTO CANAL

కని పెంచిన తండ్రినే చంపిన కొడుకు - బతికుండగానే కాలువలో పడేసిన దారుణం

son_murdered_his_father_in_palnadu_district
son_murdered_his_father_in_palnadu_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 8:55 AM IST

Son Murdered His Father In Palnadu District :చిన్నప్పటి నుంచి గుండెల్లో పెట్టుకుని చూసుకుని, పెంచిన తండ్రి నేడు అతనికి భారమయ్యాడు. వృద్ధాప్యంలో కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కుమారుడు తండ్రి పాలిట కాలయముడయ్యాడు. ఆ వృద్ధుడు బతికుండగానే కాల్వలో పడేసి కర్కశంగా కడతేర్చాడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం వద్ద గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది.

నూజండ్లకు చెందిన గంగినేని కొండయ్య(85) తనకున్న పొలం అమ్మేసి, ఆ డబ్బును పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావుకు ఇచ్చి మూడేళ్లుగా భార్య శిరోమణితో కలిసి అతని వద్దే ఉండేవారు. శిరోమణి కొద్దికాలం క్రితం చనిపోయింది. కుమారుడు వెంకటేశ్వరరావుకు గ్రామంలో పాలు, శీతల పానీయాలు, సిమెంట్‌ దుకాణాలు ఉన్నాయి. వృద్ధాప్యంలోనూ తండ్రి అతడికి చేదోడుగా ఉండేవాడు. అయినా కొడుకు, కోడలు అతడిని భారంగా భావించేవారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం కూడా ఈ విషయమై గొడవపడ్డారు.

SON THROWS FATHER INTO CANAL :ఆ తర్వాత వెంకటేశ్వరరావు ఓ కారు అద్దెకు మాట్లాడుకున్నాడు. తండ్రి కొండయ్యకు మాయమాటలు చెప్పి నమ్మించి కారులో కూర్చోబెట్టుకుని సాగర్‌ కాల్వ వంతెన వద్దకు తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా తండ్రిని కిందకు దిగమన్నాడు. తర్వాత ఉన్నపళంగా అతడిని పైకెత్తి కాల్వలో పడేశాడు. దూరం నుంచి ఇదంతా చూసిన భద్రుపాలెం గ్రామస్థులు పరుగున అక్కడకు వచ్చారు. కాల్వలో కొట్టుకుపోతున్న కొండయ్య కాపాడాలంటూ కేకలు వేశాడు.

దారుణం - బతికుండగానే తండ్రిని కాలువలో పడేసిన కుమారుడు

ఈత వచ్చినవాళ్లు ఎవరూ లేకపోవడంతో అందరూ చూస్తుండగానే ఆ వృద్ధుడు నీట మునిగి మృతి చెందాడు. వెంకటేశ్వరరావు కారెక్కి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. గ్రామస్థులు అతడ్ని అడ్డుకుని దేహశుద్ధి చేశారు. వృద్ధుడిని ఎందుకు కాల్వలో పడేశావని నిలదీశారు. తన భార్య పోరు పడలేక ఇలా చేసినట్లు చెప్పాడు. అది విని అంతా విస్తుపోయారు. ఆపై గ్రామస్థులు అతడిని పోలీసులకు అప్పగించారు. ఎస్సై ఉమామహేశ్వరరావు కొండయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

తండ్రిని నరికి చంపిన కొడుకు - ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్​

ABOUT THE AUTHOR

...view details