Son Killed Mother and Two Daughters in Khammam: ఆస్తి కోసం నవమాసాలు మోసిన తల్లిని, పసి పిల్లలైన కన్న కుమార్తెలను అతి కిరాతకంగా ఓ వ్యక్తి హత్య చేశాడు. ఎకరం భూమి, ఇంటి స్థలం తన పేరిట రాయాలని తల్లిని కొన్నాళ్లుగా పట్టుపట్టడంతో ఆమె ససేమిరా అంటోంది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిద్రలో ఉన్న తల్లి, కుమార్తెలను గొంతి నులిమి చంపేశాడు. అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణం తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటు చేసుకుంది.
Son Killed His Mother to Property : గోపాలపేటకు చెందిన పిట్టల వెంకటేశ్వర్లు భార్య కనకదుర్గ కొన్నాళ్ల క్రితం మృతి చెందింది. ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి నాలుగో తరగతి చదువుతున్న ఝాన్సీ(6), అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్లే నీరజ కుమార్తెలు ఉన్నారు. రెండో వివాహం చేసుకుని ఆమె వద్దనే వెంకటేశ్వర్లు ఉంటున్నాడు. వృద్దురాలైన అతడి తల్లి పిచ్చమ్మ (60), ఇద్దరు కుమార్తెలు కలిసి గోపాలపేటలోనే నివాసం ఉంటున్నారు. పిల్లలిద్దరినీ చూసుకుంటూ పిచ్చమ్మ జీవిస్తోంది.
హైదరాబాద్లో దారుణం - తీసుకున్న రూ. 13 వేలు తిరిగి ఇవ్వలేదని యువకుడిని హతమార్చిన ఫ్రెండ్స్ - young person murder in hyderabad
Father Murder to his Daughters Khammam: ఇటీవల పెద్ద మనవరాలికి గురుకులం సీటు రావడంతో అక్కడకి పంపించేందుకు ప్రయత్నం చేస్తోంది. తల్లి పేరుతో ఉన్న ఎకరం పొలాన్ని తనకు ఇవ్వాలని వెంకటేశ్వర్లు కొన్నాళ్లుగా వాదన పెడుతున్నాడు. ఆమె ఆడ పిల్లలున్నారని చెబుతూ, ఇవ్వనని దాటేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తల్లిపై పగ పెట్టుకున్నట్లు బంధువులు, గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తి ఇవ్వడానికి తల్లి అంగీకరించలేదని శుక్రవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వృద్దురాలు, ఇద్దరు పిల్లల గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం పరారయ్యాడు.
గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు: ఇవాళ ఉదయం స్థానికులు తల్లి, పిల్లలను ఎంత లేపినా లేవకపోయేసరికి చనిపోయినట్లుగా నిర్ధారించుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. వైరా ఏసీపీ రెహమాన్, సీఐ సాగర్, ఎస్సై వంశీ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నిందితుడికి కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
బాపట్ల యువకుడి దారుణ హత్య - విచక్షణారహితంగా కత్తులతో దాడి - Young Man Murder
కోనసీమలో దారుణం - అనుమానంతో కుమార్తెను కడతేర్చిన తండ్రి - Father Killed His Daughter