Son Killed Father in Turkayamjal : మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో దారుణానికి పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులనైనా కడతేర్చడానికైనా వెనకాడటం లేదు. తాజాగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన ఓ కుమారుడు కన్నతండ్రినే(Son at Killed Father)దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా పెట్రోల్‌పోసి నిప్పంటించి బండరాయితో తలపై మోది హతమార్చాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్‌లో జరిగింది.
Drug Addict Son at Killed Father : ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన తిరుపాటి రవీందర్ (60) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో స్థిరపడి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన తన మొదటి భార్య చనిపోగా సుధ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు. పెద్ద అబ్బాయి చాలా సంవత్సరాలు క్రితమే చనిపోయాడు. చిన్న కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు.
తండ్రిని హత్య చేసిన కుమారుడు.. రంపంతో ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో..
రవీందర్ తన రెండో భార్య సుధతో కలిసి రెండు నెలల క్రితమే తుర్కయంజాల్‌లోని ఆరెంజ్ అవెన్యూ కాలనీలో కొత్తగా కొన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వీరికి అనురాగ్, అభిషేక్ ఇద్దరు కుమారులు. పెద్ద అబ్బాయి అనురాగ్ ఖాళీగా ఉంటున్నాడు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు అతడు బానిసై అందరితోనూ నిత్యం గొడవలు పడేవాడు. అతణ్ని రీహాబిలిటేషన్ కేంద్రంలో చేర్పించి చికిత్స చేయించినా మార్పురాలేదు.