ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నమయ్య జిల్లాలో దారుణం - ఆస్తికోసం తండ్రిని కడతేర్చిన కుమారుడు - Son Killed Father

Son Killed Father in Annamayya District: ఆస్తిలో వాటా కోసం తండ్రినే హత్య చేశాడో కుమారుడు. వాకింగ్‌ ట్రాక్‌పై నడుస్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి దారుణంగా హతమార్చిన ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Son_Killed_Father_in_Annamayya_District
Son_Killed_Father_in_Annamayya_District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 7:26 PM IST

Son Killed Father in Annamayya District:సమాజంలో రోజురోజుకు విలువలు లేకుండా పోతున్నాయి. బంధుత్వాలు, మానవత్వం కన్నా ఆస్తుల సంపాదన ఎక్కువైంది. వయసు వచ్చే వరకు పెంచిన పిల్లలే ఆస్తుల కోసం తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నారు. కొంతమంది ఈజీ మనీకి అలవాటుపడి అందినకాడికి అప్పులు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా అప్పులు తీర్చాలని తల్లిదండ్రులను వేధిస్తున్నారు. అంతేకాదు ఆస్తి కోసం కన్నవాళ్లనే కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి (65)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్నకుమారుడు శంకర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. పెద్దకుమారుడు రఘునాథరెడ్డి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తూ రూ.16 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పుల వేధింపులు ఎక్కువ కావడంతో తన తండ్రిని ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరాడు. గత కొంతకాలంగా తండ్రీ కొడుకుల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది.

బుధవారం రాత్రి భోజనం చేశాక చిన్నరెడ్డప్ప వాకింగ్​కు వెళ్లాడు. వాకింగ్‌ ట్రాక్‌పై నడుస్తున్నచిన్నరెడ్డప్పరెడ్డిని ఆస్తి కోసం రఘునాథరెడ్డి నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రఘునాథరెడ్డి తన కారుతో తండ్రి చిన్నరెడ్డప్పరెడ్డిని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న సోదరుడు శంకర్​రెడ్డికి రఘునాథరెడ్డే ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో వెంటనే శంకర్‌రెడ్డి స్థానికంగా ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వడంతోపాటు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో బంధువులు, పోలీసులు రాత్రంతా చిన్నరెడ్డప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గురువారం తెల్లవారుజామున పట్టణంలోని వీవర్స్‌ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిన్నరెడ్డప్ప మృతదేహాన్ని గుర్తించారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ యువరాజు వివరాలు సేకరించి మృతదేహాన్ని మదనపల్లె సర్వజన బోధనాసుపత్రికి తరలించారు. మృతుడి చిన్నకుమారుడు శంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు రఘునాథరెడ్డిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

పల్నాడులో యువకుడు దారుణ హత్య - సంఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ - Young Man Murder

వృద్ధురాలు దారుణ హత్య - పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగుడు - Old Woman Murdered

ABOUT THE AUTHOR

...view details