ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టెకీ వినూత్న ప్రయోగం - ఆకట్టుకునే రీతిలో శ్రీరామ మంత్రం - GUNTUR SOFTWARE WRITING RAMAKOTI

రామకోటి రాస్తున్న సాప్ట్‌వేర్‌ ఉద్యోగి నాగరాజు - రామకోటిని చిత్రాల రూపంలో రాస్తున్న యువకుడు - చిత్రాలను డిజిటల్‌ రూపంలోకి తెచ్చేందుకు కృషి

Software From Guntur Writing Ramakoti
Software From Guntur Writing Ramakoti (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2025, 3:29 PM IST

Software Engineer From Guntur Writing Ramakoti :సాప్ట్‌వేర్‌ ఉద్యోగం అంటే చాలు ఐదెంకల జీతం. విలాసమైన జీవితం వీకెండ్‌ పార్టీలు, విందులు, వినోదాలు ఇవి మాత్రమే మనకు గుర్తొస్తాయి. కానీ గుంటూరుకు చెందిన యువకుడు మాత్రం అందుకు భిన్నం. ఉద్యోగం చేస్తూనే ఏ మాత్రం విశ్రాంతి దొరికినా రామకోటి రాస్తూ కోదండరాముని సేవలో పునీతమవుతున్నాడు. శ్రీరాముని జీవితం మనకు ఆదర్శం. ఆయన నామాన్ని రాయటం అదృష్టమంటోన్న యువకునిపై యువ ప్రత్యేక కథనం.

ఓ వైపు కంప్యూటర్‌లో కోడింగ్‌ మరోవైపు రామకోటి పుస్తకంలో శ్రీరామనామ రచనతో ద్విపాత్రాభినయం. ఇలా తన రామనామం కోటి లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా పయనిస్తున్నాడు. రామకోటి రాయటంతో పాటు వివిధ దేవతా మూర్తుల చిత్రాలను శ్రీరామనామంతో గీస్తున్నాడు ఈ యువకుడు.

ఈ యువకుడి పేరు నాగరాజు. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు, భూలక్ష్మి దంపతుల కుమారుడు. బెంగళూరులో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. వృత్తిరీత్యా టెకీ అయినా భిన్నమైన ప్రవృత్తిని ఎంచుకున్నాడు. రామకోటి రచనను వినూత్నంగా చేపట్టి తన ప్రత్యేకతను చాటుతున్నాడు.

అక్షరాలతో దేవుడి బొమ్మ :సాధారణంగా మనం రామకోటి రాస్తే "శ్రీరామ" అంటూ వరుసల్లో రాస్తుంటాం. వీటి కోసం ప్రత్యేకంగా పుస్తకాలు ఉంటాయి. కానీ నాగరాజు మాత్రం రామకోటిని చిత్రాల రూపంలో రాస్తుండటం అతని సృజనాత్మకతకు నిదర్శనం. మామాలుగా గీతలను చక్కని ఆకృతిలో గీస్తే ఓ బొమ్మ అవుతుంది. ఈ యువకుడు గీతల బదులు శ్రీరామ అనే అక్షరాలను రాస్తూ దేవుడి బొమ్మను వేస్తూ ఔరా అనిపించాడు.

వ్యవసాయమంటే దండగ కాదు - పండగ అని నిరూపిస్తున్న యువ రైతులు

శ్రీరామ అనే పదాల్ని వేర్వేరు రంగులతో రాస్తాడు. దీని కోసం దాదాపు 12 రకాల పెన్నులను వినియోగిస్తాడు. శ్రీరామ అక్షరాలను రాస్తూ రాముడు, హనుమంతుడు, శివుడి బొమ్మలను వేశాడు. చిన్నతనంలో తన నానమ్మ ఇలాగే శ్రీరామకోటి రాసేదని ఆమె స్ఫూర్తితో ఈ ప్రయత్నం చేశానని నాగరాజు తెలిపాడు.

"కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. బొమ్మలు గీస్తూ రామ నామాలు రాయడం అంటే, కానీ రాస్తున్నాను. నా చిన్నప్పుడు మా నాన్నమ్మను చూసేవాడిని రాయడం. అలా ఆసక్తి కలిగింది. నాకు రాముడు అంటే చాలా భక్తి. ఎందుకు పిక్టోరియల్​గా రాయకూడదు అనిపించింది. అందుకే కలర్ పెన్నులతో రాస్తున్నాను." - నాగరాజు, సాఫ్ట్​వేర్ ఉద్యోగి

కేవలం చిత్రాలు గీయటంతో సరిపెట్టుకోకుండా వాటిని డిజిటల్‌ రూపంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. ఈ చిత్రాలను ఫోటోలు తీసి వాటి నేపథ్యాన్ని వివరిస్తున్నాడు. వీటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచటం ద్వారా యువతకు శ్రీరామ మంత్రాన్ని దగ్గర చేస్తున్నాడు. వారిలో కూడా రామకోటి రాయాలనే ఆలోచనను రేకెతిస్తున్నాడు.

ధర్మ పరిరక్షణ కోసం తమ వంతు కృషి :నాగరాజు చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోందని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. తాము కూడా ఆధ్యాత్మిక బాటలోనే వెళ్తున్నామన్నారు. నిత్యం రామకోటి పుస్తకాలకు పూజలు చేయటం పుస్తకం పూర్తికాగానే రామక్షేత్రంలో అందజేస్తున్నామన్నారు. శ్రీరామకోటి రాయటంతో పాటు ఆలయాల్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ధర్మ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేయటం ఎంతో సంతోషంగా ఉందని నాగరాజు చెబుతున్నాడు.

విలాసవంతమైన జీవితం వదులుకుని 'వే' చూపిస్తున్న యువకుడు

రెండు కాళ్లు లేకుంటేనేం! - స్విమ్మింగ్‌ పోటీల్లో బంగారు పతకాలు

ABOUT THE AUTHOR

...view details