ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విమానంలో పాములు -బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం- వణికిపోయిన ప్రయాణికలు

ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద విషపూరితమైన పాముల గుర్తింపు - బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళలు

Snakes in airline
Snakes in airline (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 10:47 AM IST

విమానాల్లో ప్రయాణికులు ప్రయాణిస్తారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొన్ని సార్లు అక్కడ తక్కువ ధరకు లభించే వస్తువులు కొనుగోలు చేసి తెచ్చుకంటారు. ఇలా తెచ్చుకున్న వస్తువులకు పన్నులు చెల్లించారా? లేదా? అని ప్రతి విమానాశ్రయంలోనూ కస్టమ్స్‌ అధికారులు పర్యవేక్షిస్తారు. సాధారణంగా కొన్ని విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో డ్రగ్స్‌, బంగారం, పన్ను చెల్లించని వస్తువులు లభ్యం అవుతాయి. వాటిని కస్టమ్స్‌ విభాగం స్వాధీనం చేసుకుంటుంది కానీ శంషాబాద్‌ విమానాశ్రయంలో మాత్రం కస్టమ్స్‌ తనిఖీల్లో పాములు లభ్యమయ్యాయి. పాములు విమాన ప్రయాణికుల బ్యాగుల్లో దొరికాయన్న సమాచారం వెలుగు చూడటం విమానాశ్రయంలో ఆందోళన వ్యక్తమైంది.

బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమాన ప్రయాణికుల వద్ద బ్యాగులను కూడా కస్టమ్స్‌ అధికారులు ఇలానే తనిఖీ చేశారు. కానీ వారి తనిఖీల్లో లభ్యమైన వాటిని చూసి కంగుతినడం అధికారుల వంతు అయ్యింది. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఇద్దరు మహిళ ప్రయాణికుల బ్యాగుల్లో విషపూరితమైన పాములు లభ్యమయ్యాయి. ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్‌ నుంచి ఇక్కడికి ఎందుకు తెచ్చారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర, అసాంఘీక చర్య ఉందా? అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. పట్టుకున్న పాములను అనకొండలుగా భావిస్తున్నారు. అసలు ఈ పాములను ఎందుకు తరలిస్తున్నారన్న విషయమై విచారణ చేస్తున్నారు.

పాములను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్న విషయం తెలిసి బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ ప్రయాణించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్తితి ఏంటిన్న ప్రశ్నవారి నుంచి ఉత్ఫన్నమైంది.

ABOUT THE AUTHOR

...view details