Snake Scorpion Viral Video :"జీవితమంటే పోరాటం.. పోరాటంలో ఉంది జయం." ఇది సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రంలో పాట. మనం బతకాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోక తప్పదు. అయితే ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు. జంతువులకు కూడా వర్తిస్తుంది. జంతువులు బతకాలంటే ఆహారం కావాలి. అవి ఆహారం కోసం చేసే ప్రయత్నాలు, పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నిసార్లు ఆహారాన్ని వెతుకున్నే క్రమంలో, ఇతర జీవులకు ఫుడ్‌గా మారిపోతుంటాయి.
అడవిలో బలం ఉన్నోడిదే పైచేయి అనుకుంటాం కానీ, కొన్ని సందర్భాల్లో చిన్న జీవుల చేతిలో పెద్ద జంతువులు కూడా మరణిస్తాయి. ఈ వీడియో చూస్తే అది నిజమేనని అనిపించక మానదు. బతుకు కోసం ఎవరి పోరాటం వారిదే మరి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోను చూసేయండి మరి.
బాగా ఆకలి మీద ఉన్న పాము పొదల్లో ఉన్న తేలును ఒక్కసారిగా ఆరగించబోయింది. కానీ తేలు మాత్రం పాముకు చుక్కలు చూపించింది. పాము మెడను తన కొండిలతో గట్టిగా పట్టుకుని దానికి ఊపిరాడకుండా చేసింది తేలు. తేలు ఉడుంపట్టుకు పాముకు అటు మింగలేక, తేలును వదలలేక గిలగిలలాడిపోయింది. ఈ వీడియోను క్షుణ్నంగా పరిశీలిస్తే చివరకు ఈ పోరాటంలో తేలు చేతిలో పాము ప్రాణాలు విడిచినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పాములో అసలు చలనమే లేదు.