Smart City Constructions Has Stopped in No Funds: కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో ఐదేళ్లుగా స్మార్ట్ సిటీ నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 2016లో తిరుపతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చినా ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 30 నాటికి గడువు ముగుస్తున్నా స్మార్ట్ సిటీ కింద చేపట్టిన 25 ప్రాజెక్ట్‌లు పూర్తికాలేదు. సామాజిక మౌలిక వసతుల కల్పన, క్రీడా మైదానాలు, భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నగర పాలక సంస్థ తమ వాటా నిధుల విడుదలలో జాప్యమే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో కేంద్రం చేపట్టిన స్మార్ట్ సిటీ నిర్మాణాలు తిరుపతిలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. 2016లో కేంద్రం దేశ వ్యాప్తంగా చేపట్టిన స్మార్ట్ సిటీ నిర్మాణాలలో తిరుపతికి చోటు కల్పించారు. 1593 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 500 కోట్ల రూపాయల చొప్పున, స్థానిక సంస్థల వాటాగా 593 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన స్మార్ట్ సిటీ నిధులకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 186 కోట్లు కేటాయించింది. 2019 మేలో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో స్మార్ట్ సిటీ నిధులు అటకెక్కాయి. టీడీపీ సర్కారు విడుదల చేసిన 186 కోట్లు మినహా గడచిన ఐదేళ్లలో వైసీపీ సర్కారు చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఫలితంగా పలు ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
'స్మార్ట్‌గా అమరావతి' పీకనొక్కిన జగన్ సర్కార్ - Amaravati Smart City funds