Situation of Universities at Amaravati :వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతి ఇప్పుడు సత్వర ఉపశమనం కోసం ఎదురు చూస్తోంది. జగన్ జమానాలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బంది పడిన ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పుడు రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కోరుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వానికి అవసరమైన మేర సహకరిస్తామని భరోసా ఇస్తున్నాయి.
సరైన రోడ్డు లేక విద్యార్థుల ఆందోళనలు : అడుగడుగునా గుంతలు, కంకర తేలి కనిపిస్తున్న ఈ రహదారులు అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని వచ్చిన ఎస్‌ఆర్‌ఎం, విట్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు గత ప్రభుత్వం ఇచ్చిన బహుమానాలు! ఇవేకాదు అమరావతిలో అంతర్గత రోడ్లన్నింటినీ గాలికొదిలేశారు. చాలాచోట్ల రహదారులను అడ్డగోలుగా పెరిగిన కంపచెట్లు మూసేశాయి. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన సంస్థలు సైతం అమరావతిలో అంతర్గత రోడ్లు సరిగా లేవని ఆవేదన వ్యక్తంచేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజధాని పరిధిలో కేంద్రం నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక విద్యార్థులు ఆందోళనలు చేసిన పరిస్థితి.
అమరావతి వైభవం-విలసిల్లాలి నలుదిశలా! అదే చంద్రన్న ఆన - cm chandrababu visiting amaravati
విద్యార్థుల ఒళ్లు హూనం :అమరావతి విట్‌లో 10 వేల మంది, ఎస్ఆర్ఎమ్లో 7 వేల మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ యూనివర్శిటీలు వసతి కల్పించలేకపోవడంతో విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్న విద్యార్థుల ఒళ్లు హూనం అవుతోంది. అమరావతిలో మౌళిక వసతులు సరిగా లేక విస్తరణ విషయంలో అచితూచి అడుగులు వేసిన యూనివర్శిటీల యాజమాన్యాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త భవనాల నిర్మాణానికి పూనుకున్నాయి. పనులూ వేగంగా జరుగుతున్నాయి.