ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్షేత్రస్థాయిలో విచారణను ప్రారంభించిన సిట్‌ - కీలక రాజకీయ పార్టీ నేతలను అరెస్టు చేసే అవకాశం - SIT INVESTIGATE VIOLENCE IN AP - SIT INVESTIGATE VIOLENCE IN AP

SIT investigation Start in AP: రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్‌ రంగంలోకి దిగింది. ఐజీ వినీత్ బ్రిజ్​లాల్ ఆధ్వర్యంలోని 13మంది సభ్యుల బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టారు. అల్లర్లలపై ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు.

SIT_Investigation_Start_in_AP
SIT_Investigation_Start_in_AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 10:50 PM IST

Updated : May 18, 2024, 10:59 PM IST

SIT investigation Start in AP:ఎన్నికల రోజు, ఆ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేపట్టింది. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నిందుతులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో కొందరు కీలక నేతలను అరెస్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్‌ బృందం నేరుగా విచారణ జరుపుతోంది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్​ఐఆర్​లను పరిశీలించింది. అల్లర్ల ఘటనలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సిట్‌కు చేరినట్లు సమాచారం.

రాష్ట్రంలో అల్లర్లపై సిట్​ దర్యాప్తు షురూ- అధికార పార్టీ నేతల్లో వణుకు - SIT investigation

Tirupati District:దర్యాప్తులో భాగంగా ప్రత్యేక విచారణ బృందం తిరుపతిలో పద్మావతి మహిళా వర్సిటీలో (Padmavati Women University) విచారణ చేపట్టారు. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై (Chandragiri TDP candidate Pulivarthi Nani) తిరుపతి మహిళా వర్సిటీ ప్రాంగణంలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ రవి మనోహరాచారి బృందం ఆ రోజు జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరించారు. హింసాత్మకఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి తీసుకున్నారు. దీనిపై త్వరలోనే నివేదికను సమర్పించనున్నారు.

Anantapur District:అనంతరం తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడులు, ఘర్షణలపై విచారణ చేపట్టేందుకు సిట్ బృందం విజయవాడ నుంచి అనంతపురం చేరుకుంది. తాడిపత్రిలో పోలింగ్ రోజు, మర్నాడు జరిగిన ఘర్షణలపై దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. తాడిపత్రిలో రాళ్ల దాడులు, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో రెండ్రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిట్ బృందం విచారించనుంది. ఆదివారం ఉదయం తాడిపత్రిలో, ఆ తర్వాత అనంతపురంలోనూ విచారణ చేపట్టనున్నారు.

రాష్ట్రంలోని హింసాకాండపై 'సిట్​' దర్యాప్తు - ఎఫ్ఐఆర్​లలో మార్పులు, చేర్పులకూ సిద్ధం! - SIT INVESTIGATE VIOLENCE

మరికొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్​ఐఆర్​లను ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ (IG Vineet Brijlal) నేతృత్వంలోని బృందం దర్యాప్తు పునఃసమీక్ష చేస్తోంది. ఆయా జిల్లాల్లో అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

క్షేత్రస్థాయిలో విచారణను ప్రారంభించిన సిట్‌ - కీలక రాజకీయ పార్టీ నేతలను అరెస్టు చేసే అవకాశం (ETV Bharat)

పోలింగ్​ అనంతర హింస్మాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు-సభ్యులుగా ఎవరంటే? - SIT Formation on Violence Incidents

Last Updated : May 18, 2024, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details