Sister in Law Harassment 19 Years Old Girl Dies by Suicide in Hyderabad :హైదరాబాద్ బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 11న (నవంబర్ 11న) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి కేసును పోలీసులు ఛేదించారు. అన్న భార్య శైలజ వేధింపుల వల్లే స్రవంతి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనలో శైలజతో పాటు ఆమె మాజీ ప్రియుడిని అరెస్టు చేశారు.
విద్యార్థిని ఆత్మహత్య కేసు : హైదరాబాద్ నగరంలో రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన విఠల్ కూతురు స్రవంతి(19) ఈ నెల 11వ (నవంబర్ 11న) తేదీన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్రవంతి సెల్‌ఫోన్‌లోని సందేశాల ఆధారంగా యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
తమ్ముడి మోసాన్ని తట్టుకోలేక పోయిన అన్నయ్య - ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణం
వదిన ఆడిన నాటకం :స్రవంతి వదిన శైలజకు నవీన్ కుమార్‌తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతను మళ్లీ ఈ మధ్య కాలంలో శైలజను కలవడం ప్రారంభించారు. ఈ విషయం స్రవంతికి తెలిసింది. దీంతో వారి మధ్య సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని భావించిన శైలజ.. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ నిత్యం ఆమెను వేధిస్తోంది. అతను తనకు సోదరుడి వంటి వాడని స్రవంతి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా వేధింపులు ఆపలేదు. పైగా తనతో సంబంధం ఉన్న నవీన్ కుమార్‌ను రంగంలోకి దించింది. అతనితో స్రవంతి ఫోన్‌కు సందేశాలు పంపిస్తుండేది. వదిన శైలజ, నవీన్ కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనలో శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను గురువారం (నవంబర్ 14న) పోలీసులు అరెస్టు చేశారు.
తల్లికి అనారోగ్యంతో పాటు మానసిక సమస్య - ఆమె కుమార్తె ఏం చేసిందంటే?
'నీవు లేని లోకంలో ఉండలేను - నీవెంటే నేను'