Man Achieved Three Guinness Book Records Due To Coins Collecting : 'చూడు.. ఒకవైపే చూడు..రెండో వైపు చూడకు' ఈ డైలాగ్ సినిమాలో బాగా ఫేమస్ కదా. అయితే ఒక వ్యక్తి మాత్రం కనిపించిన ప్రతి నాణేన్నీ రెండో వైపే కాదు అన్ని వైపులా చూడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే నాణేల సేకరణను అభిరుచిగా మలచుకున్నాడు. మూడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను సాధించాడు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ముద్రించే బై-మెటాలిక్ (ద్విలోహ), ముద్రణా లోపాల నాణేల సేకరించి ఖ్యాతి గడించారు. ఆయనే శంకరరావు కొండపనేని. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మున్నలూరు గ్రామంలో జన్మించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో స్థిరపడ్డారు. ఇంతకి ఈ ఆలోచన ఆయనకు ఎప్పుడు, ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
అమరావతి ప్రభావంతో..
‘‘నేను పుట్టి పెరిగింది ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఉన్న అమరావతి పరిసర ప్రాంతం. దీంతో ఎప్పుడూ చరిత్ర తెలుసుకోవాలనే కోరిక ఉండేది. ఈ నేపథ్యంలోనే అరుదైన నాణేలు, పెయింటింగ్స్ అంటే చిన్న వయస్సు నుంచి ఎంతో ఇష్టం ఉండేది. యుక్త వయసులో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చిన ఓ నాణెంపై ‘భారత్’కు బదులుగా ‘మారత్’ అని హిందీలో తప్పుగా ముద్రించటాన్ని గుర్తించా. అప్పట్నుంచి కనిపించే ప్రతి నాణేన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టా. అలాంటి తప్పులున్న మరికొన్ని నాణేలను సేకరిస్తూ వచ్చా. పురాతన నాణేలపై ముద్రించిన చిహ్నాలు, లిపిని గమనిస్తూ ఉండేవాడిని. అలాగే వాటి చరిత్రను తెలుసుకునే వాన్ని. ఈ క్రమంలో వాటిపై ఆసక్తి కాస్తా మమకారంగా మారింది. ఈ సమాచారాన్ని భవిష్యత్తు తరాలకు తెలపాలనే లక్ష్యంతో ‘సేవ్ కాయిన్స్-సేవ్ హెరిటేజ్’ నినాదాన్ని మొదలు పెట్టా. ఇలా మూడు దశాబ్దాలుగా వేల సంఖ్యలో నాణేలను సేకరిస్తూ వస్తున్నా.
ఎనిమిది నెలల్లో మూడు రికార్డులు..