Chandrababu Pawan Kalyan Meeting : అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇరువురూ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. కిందిస్థాయి నేతల మధ్య సమన్వయం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
అదే విధంగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించగా, ఆయన ప్రమాణ స్వీకార తేదీపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల మలి జాబితా తదితర అంశాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం, రాబోయే సహకార ఎన్నికల్లో కూడా ఇదే తరహా సమన్వయంపై చంద్రబాబు, పవన్ చర్చించినట్లు సమాచారం.
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు - త్వరలో ఏపీ కేబినెట్లోకి నాగబాబు