ETV Bharat / state

స్కూల్ జర్నీలో విషాదం - విద్యార్థితో పాటు బస్ క్లీనర్​ని మింగేసిన ఫామ్​పాండ్ - STUDENT CLEANER DIED IN PULIPADU

పల్నాడు జిల్లా గురజాల మండలంలో ఫామ్​పాండ్​లో పడి ఇద్దరు మృతి - శ్రీచైతన్య స్కూల్ ఐదో తరగతి విద్యార్థి, స్కూల్ బస్సు క్లీనర్ మృతి

Student_Died_in_Pulipadu
Student Died in Pulipadu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

STUDENT AND CLEANER DIED IN PULIPADU : ఓ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. చదువుకుని గొప్ప వాడవుతాడని కలలు గన్న ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకం మిగిల్చింది. రోజులాగే పాఠశాల బస్సులో స్కూల్​కు వెళ్లిన విద్యార్ధి నీటి కుంట (farm pond) లో పడ్డాడు. చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన బస్సు క్లీనర్ సైతం కుంటలో పడి మృతి చెందాడు. ఆ ఇద్దరి మరణం పల్నాడు జిల్లా పులిపాడులో సంచలనం రేపింది. ఇద్దరి మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

తన పాఠశాల బస్సు కోసం నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన బాలుడితో పాటు కాపాడేందుకు వెళ్లిన బస్సు క్లీనర్​ నీటి కుంటలో పడి మరణించారు. బస్సు డ్రైవర్, యాజమాన్య నిర్లక్ష్యానికి ఇద్దరు మరణించటంతో స్థానికులు, బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. చదువుకుని గొప్పవాడవుతాడన్న బాలుడు, 11 యేళ్ల వయసులోనే మృత్యువాత పడటం అందరినీ కలచివేసింది.

పులిపాడు గ్రామానికి చెందిన సుభాష్ దాచేపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. రోజులాగే తల్లిదండ్రులు స్కూల్ బస్సు ఎక్కించి పంపించారు. మార్గ మధ్యలో స్కూల్ రేడియేటర్లో నీళ్లు అయిపోవడంతో బస్సు ఆగిపోయింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న కుంటలో నీళ్లు తెచ్చేందుకు బస్సు డ్రైవర్ విద్యార్థి సుభాష్​ను పంపాడు. నీటి కోసం వెళ్లిన సుభాష్ నీళ్లు లోతులో ఉండటంతో పాటు చుట్టుపక్కల ప్లాస్టిక్ షీట్​తో కప్పి ఉండటంతో హఠాత్తుగా కుంటలో పడ్డాడు.

ఇది గమనించిన బస్సు క్లీనర్ సుబాష్​ను కాపాడేందుకు నీటి కుంట వద్దకు వెళ్లాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో అందులో పడి మృతి చెందారు. ఇదే బస్సుకు చెందిన డ్రైవర్ మద్యం సేవిస్తూ బస్సు నడుపుతున్నాడని గతంలో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. మళ్లీ తప్పు జరగకుండా చూస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన పాఠశాల యాజమాన్యం, అదే డ్రైవర్​ను కొనసాగించిందని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టాలని మృతుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

దీనిపై సమాచారమందుకున్న గురజాల ఆర్డీవో, డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను, పోలీసులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. నీటి కుంట లోతుగా ఉండటం, ప్లాస్టిక్ షీట్ కప్పి ఉండటంతో చిన్నారి కాలు జారి పడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విద్యార్ధులు, స్థానికులు అప్రమత్తమై రోడ్డుపై వెళుతున్న వాహనదారులను ఆపి నీటికుంటకు గండి కొట్టారని డీఎస్పీ తెలిపారు.

తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుల కుటుంబసభ్యులు రోడ్డుపై కొద్ది సేపు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల వెర్షన్: నీటి కోసం క్లీనర్ కుంటలోకి దిగారని, అతనితోపాటు మరో ఇద్దరు విద్యార్థులను తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. క్లీనర్ నీళ్లు పట్టి విద్యార్థికి ఇచ్చాడని అన్నారు. ఆ సమయంలో విద్యార్థి కాలు జారి క్లీనర్ మీద పడటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారని పేర్కొన్నారు. వెంటనే పక్కనే ఉన్న మరో విద్యార్థి స్థానికులకు చెప్పడంతో, గండి కొట్టారని అన్నారు. అయితే అప్పటికే ఇద్దరూ చనిపోయారని వెల్లడించారు. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు.

ప్రాణం పోతున్నా కర్తవ్యదీక్ష వీడని జవాన్​- రావిపాడులో విషాద ఛాయలు

ఇంటర్మీడియట్ విద్యార్థిని సజీవ దహనం - హత్యనా, ఆత్మహత్యనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.