ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అలసత్వం, అజాగ్రత్త- వేరువేరు ఘటనల్లో ముగ్గురు మహిళలు సహా 12మంది మృతి - People Died in Various Accidents - PEOPLE DIED IN VARIOUS ACCIDENTS

Several People Died in Various Accidents Across the State: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 12మంది మృతి చెందారు. అన్ని ఘటనల్లో అలసత్వం, అజాగ్రత్త ప్రతిబింబించింది. కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో పడి ముగ్గురు మహిళలు మృతి చెందగా బాపట్ల జిల్లాలో ఆగిఉన్న బైక్​ని కారు వైగంగా ఢి కొట్టడంకో ఇద్దరు చిన్నారులు ప్రాణం విడిచారు.

people_died_in_various_accidents
people_died_in_various_accidents (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 3:57 PM IST

Updated : May 12, 2024, 5:17 PM IST

Three women died in Godavari river:అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం మెర్లపాలెం వద్ద ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఆలమూరు మండలం చిలకలపాడుకు చెందిన ముగ్గురు మహిళలు ప్రతివారం కాలినడకన వెళ్లి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఈ క్రమంలో గోదావరి దాటుతుండగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఊబిలో పడి గల్లంతయ్యారు. గోదావరిలో మృతదేహాలు లభ్యమవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు అనంతలక్ష్మి, కొప్పిరెడ్డి ఏసమ్మ, కర్రీ సునీతలగా గుర్తించారు.

బస్సుల ఏర్పాటులో ఏపీఎస్​ఆర్టీసీ విఫలం - ప్రయాణికుల ఇబ్బందులు - passengers problems in ap

Two Children Died in Accident:బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం రొంపేరు బ్రిడ్జి సమీపంలో జాతీయరహాదారిపై ఘోర రొడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహానాన్ని కారు ఢీ కొనడంతొ ఇద్దరు అక్కాచెల్లేళ్ళు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలిక, ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే యాలవల వెంకటేశ్వర్లు, భారతి దంపతులు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. ఉప్పుగుండూరులోని ఒక మిఠాయి దుకాణంలో వెంకటేశ్వర్లు పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రేపు బాపట్లలో ఓట్లు వేసేందుకు రెండు ద్విచక్రవాహనాలపై భార్య భర్త ఒక వాహనంపై, వెంకటేశ్వర్లు తమ్ముడు లక్ష్మయ్యలు ముగ్గురు బాలికలను తీసుకుని మరో వాహనంపై బాపట్ల బయలుదేరారు. చినగంజాం రొంపేరు కాలువ వద్దకు వచ్చేసరికి పొన్నూరు వైపు నుంచి ఒంగోలు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దేవిసంద్య(11), అశ్విని(7) మృతి చెందగా జస్వంత(9), లక్ష్మయ్యలకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారు అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు.

పారిశ్రామిక భూమిలో రియల్‌ ఎస్టేట్‌ - తెర వెనక మంత్రి, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ పెద్ద - real estate in industrial land

Road Accident at Visakha NAD Flyover: విశాఖ ఎన్ఏడీ(NAD) ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టటంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు తనవరపు కుమార్, అరవెల్లి పవన్ కుమార్​గా గుర్తింంచారు. ఘటనపై ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి:అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి శ్రీధర్ అనే డ్రైవర్ మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా భట్టిప్రోలులో చోటు చేసుకుంది. అనుమతులు లేకుండా పెదలంక సమీపంలో వైసీపీ నేతల అండతో యద్ధేచ్చగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో ఇసుక లోడు చేసుకొని వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ చింతమోటు గ్రామ శివారులో బోల్తాపడడంతో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

జగన్​కు దారుణ పరాభవం - ఆ మంత్రి గెలిచినా టీడీపీలోకి వెళ్తాడు - పీకే మరో సంచలన ఇంటర్వ్యూ - Prashant kishor on ap elections

చెరువులో మునిగి ఇద్దరు మృతి:శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బిర్లంగి గ్రామంలో చెరువులో మునిగి ఓ మహిళతో పాటు వృద్ధుడు మృతి చెందారు. బిర్లంగి గ్రామానికి చెందిన సబితా రౌలో(48) సమీప చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఓ గుంతలో పడి చిక్కుకుంది. ఈ విషయాన్ని గమనించిన ధూపాన బైరి(75) అనే వృద్ధుడు ఆమెను రక్షించేందుకు వెళ్లి చెరువులోకి వెళ్లగా అతను కూడా అదే గుంతలో చిక్కకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు చెరువులో చిక్కుకున్న ఇరువురును బయటకు తీసి ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

అలసత్వం, అజాగ్రత్త- వేరువేరు ఘటనల్లో ముగ్గురు మహిళలు సహా 12మంది మృతి (Etv Bharat)
Last Updated : May 12, 2024, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details