ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెదక్‌ జిల్లాలో చెట్టును ఢీకొట్టిన కారు - ఏడుగురు మృతి - MEDAK ROAD ACCIDENT

తెలంగాణలోని మెదక్‌ జిల్లా శివంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం - ఏడుగురు మృతి

atal_road_accident
atal_road_accident (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2024, 5:19 PM IST

Updated : Oct 16, 2024, 7:17 PM IST

Fatal Road Accident in Medak District:తెలంగాణలోనిమెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలితీసుకుంది. జిల్లాలోని శివంపేట మండలం ఉసిరికపల్లి వద్ద రోడ్డుపై ఉన్న గుంత వారి పాలిట మృత్యువుగా మారింది. రహదారిపై ఉన్న గుంతను గమనించకపోవడంతో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రమే గాయలతో బయటపడ్డాడు.

ప్రమాద సమయంలో కారు వేగంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. గుంతలో పడిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు కాలువలోకి దూసుకెళ్లిన కారును బయటకు తీసుకొచ్చారు. అప్పటికే కారులోనే ఏడుగురు మృతి చెందారు.

మెదక్ జిల్లాలో ఏడుగురు దుర్మరణం (ETV Bharat) (ETVBharat)

మృతుల వివరాలు: మృతులు భీమ్లా తండాకు శాంతి (38), మమత (12), సీతారాం తండాకు చెందిన అనిత (35), హిందూ (13), శ్రావణి (12), తలపల్లి తండాకు చెందిన శివరాం (56), దుర్గి (45)గా గుర్తించారు. ప్రమాదంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నామ్‌సింగ్‌ (40)కు రెండు కాళ్లు విరిగాయి. వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నామ్‌సింగ్ భార్య శాంతి, కుమార్తె మమత, అత్త, మామ, మరదలు కూడా మృతి చెందారు. వీరంతా తూప్రాన్ దగ్గర ముత్యాలమ్మ గ్రామ దేవత దగ్గరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

గుంతే ప్రమాదానికి కారణం: మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన నామ్​సింగ్​కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇటీవలి వర్షాలకు రోడ్డుపై ఏర్పడిన గుంతే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారులపై గుంతలు ప్రమాదకరంగా మారాయని అధికారులు ఇకనైనా స్పందించి మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మృతి

డయేరియా పంజా - రెండ్రోజుల్లో ఐదుగురు మృతి - సీఎం చంద్రబాబు ఆరా

Last Updated : Oct 16, 2024, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details