45 People Died Due to Heavy Rains in AP :రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 45 మంది మృతి చెందినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 35 మంది మృతి చెందారని వెల్లడించింది. రాష్ట్రంలో సగటు కంటే 30 శాతం మేర అదనపు వర్షం కురిసిందని స్పష్టం చేసింది. వర్షాలు, వరదలకు సంబంధించి 7.49 కోట్ల హెచ్చరిక సందేశాలను పంపినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ తెలియచేసింది.
261 ప్రాంతాలు జలమయం :రాష్ట్ర వ్యాప్తంగా 1.81 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అలాగే 20 జిల్లాల్లో 20 లక్షల 5 వేల మంది రైతులు ప్రభావితం అయ్యారని స్పష్టం చేసింది. ఇక వరదల కారణంగా 19,686 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలియచేసింది. వర్షాలు వరదల కారణంగా పట్టణాలు, నగరాల్లో 261 ప్రాంతాలు జలమయం అయ్యాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం 162 ప్రాంతాల్లో నుంచి నీటిని తొలగించి యథాపూర్వ స్థితికి తెచ్చినట్టు ప్రకటించింది.
భారీ వర్షాలు, వరదలతో 32 మంది మృతి - విరాళాలు ఇచ్చేవారికి పన్ను మినహాయింపు - Several People Dead in Floods
3913 కిలోమీటర్ల రహదారులు ధ్వంసం :53 కిలోమీటర్ల మేర డ్రెయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రెయిన్లు ధ్వంసం అయ్యాయని ప్రభుత్వం తెలియజేసింది. వర్షాలు, వరదలతో ఇప్పటి వరకూ 6.44 లక్షల మంది ప్రభావితం అయినట్టు తెలిపింది. అలాగే 473 పశువులు, 71,639 కోళ్లు మృతి చెందినట్లు స్పష్టం చేసింది. వరదల వల్ల 377 బోట్లు దెబ్బతిన్నాయని తెలిపింది. 3,381 హెక్టార్లలోని ఆక్వా చెరువులు ధ్వంసమైనట్టు స్పష్టం చేసింది. దెబ్బతిన్న 7 సబ్ స్టేషన్లను పునరుద్ధరించిన విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ధ్వంసమైన 233కేవీ ఫీడర్లను కూడా పునరుద్ధరించినట్టు ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3913 కిలోమీటర్ల రహదారులు ధ్వంసం అయ్యాయని పేర్కొంది. 63 చోట్ల రహదారులు తెగిపోతే 45 చోట్ల పునరుద్ధరించామని రహదారులు భవనాల శాఖ స్పష్టం చేసింది.
వరద నష్టాన్ని ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని లక్షల మంది నష్టపోయారో తెలుసా? - Report on the Damages Caused
విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు- ఒడిశా నిలిచిన రాకపోకలు - FLOOD IN VIZIANAGARAM DISTRICT