ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొగల్తూరులో వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్న దొంగలు - Serial Thefts in West Godavari Dist - SERIAL THEFTS IN WEST GODAVARI DIST

Serial Thefts in West Godavari Districts : ఎప్పుడు వస్తారో, ఎటు నుంచి వస్తారో తెలియదు. తాళమేసిన ఇంటిని ఎలా కొల్లగొడుతున్నారో అర్థం కాదు. సినిమా రేంజ్​లో ప్లాన్​ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు దొంగలు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల వరుసగా దొంగతనాలు పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దొంగతనాల ముఠా దిగిందేమోనన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

serial_thefts_in_west_godavari_districts
serial_thefts_in_west_godavari_districts (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 1:03 PM IST

Serial Thefts in West Godavari Districts : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు బేంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల్లో వరుసగా ఐదు భారీ దొంగతనాలు జరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. తూర్పుతాళ్ళు గ్రామంలోని శ్రీ దుర్గ జ్యూయలర్స్ బంగారం షాప్ వెనుక గోడకు రంద్రం చేసి సుమారు రూ. 50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. ఆధారాలు దొరక్కుండా షాప్ లోని సీసీటీవీ హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లిపోయారు. సంఘటనా స్థలాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ పరిశీలించారు. వరుస దొంగతనాలపై క్లూస్ దొరికాయని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.

పోలీసులకు సవాల్- వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్న దొంగలు (ETV Bharat)

ఇదే తరహాలో మొగల్తూరు మండలం రామన్నపాలెంలో పట్టపగలే అంగన్​వాడీ టీచర్ ఇంటి తాళం పగలగొట్టి నగలు, నగదు దోచుకెళ్లారు. ఇక్కడ కూడా సీసీటీవీపుటేజ్ ఎత్తుకేళ్లారు దొంగలు. రెండు రోజులు క్రితం నరసాపురం రెండు దొంగతనాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగతనం జరిగిన ఇండ్లలో క్లూస్ టీమ్​తో దొంగల వేలిముద్రలు సేకరిస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

జాగ్రత్త - ఇంటికి తాళం వేశారో అంతా మాయమే - Thieves Robbery at House In kadapa

ఉమ్మడి జిల్లాలో వరుస గొలుసు చోరీలు జరుగుతుండటంతో ప్రజలకు పోలీసు అధికారులు పలు సూచనలు చేశారు. నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లొద్దని ఉదయం, సాయంత్రం నడకకు, ఆలయాలకు తోడు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. మహిళలు మెడలో బంగారు గొలుసు లేకుండా వెళితే మంచిదని ఒకవేళ ధరిస్తే చీర కొంగు, చున్నీలతో కనిపించకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు అనుమానమొస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

బంగారం వర్క​ర్లపై దుండగులు దాడి - దొరికినంత దోచుకుని పరార్​

మొగల్తూరులో ఓ మహిళ నడిచి వెళ్తుండగా మెడలోని గొలుసును ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు లాక్కెళ్లాడు. రొయ్యలు విక్రయించుకునే మహిళ మెడలోని 3 కాసుల బంగారు వస్తువును ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు లాగేశాడు. భీమవరంలో సత్యవతి అనే మహిళ నాచువారికూడలి నుంచి దేవాలయానికి వెళ్తుండగా 20 నుంచి 25 ఏళ్లులోపు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలోని 3 కాసులు బంగారు తాడును లాక్కెళ్లిపోయారు. ఈ వరుస దొంగతనాల ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details