తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి - పంటలు బాగా పండుతాయి - రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత - Lashkar Rangam Bhavishyavani 2024 - LASHKAR RANGAM BHAVISHYAVANI 2024

Lashkar Rangam Bhavishyavani 2024 : సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాలు రెండో రోజు కన్నుల పండువగా సాగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పోటెత్తారు. రెండో రోజులో భాగంగా అమ్మవారి రంగం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు.

Rangam Bhavishyavani 2024
Rangam Bhavishyavani 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 10:08 AM IST

Updated : Jul 22, 2024, 3:23 PM IST

Lashkar Rangam Bhavishyavani 2024: సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. వడి బియ్యం, చీర సారెలతో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఏనుగు అంబారీపై అమ్మవారి ఊరేగింపు కనువిందు చేసింది. ఆలయంలో మహంకాళీ అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత రంగం భవిష్యవాణి చెప్పారు. భక్తుల తరపున ఆలయ పూజారి అడిగిన సందేహాలకు ఆమె సమాధానాలు చెప్పారు.

ప్రశ్న:250 ఏళ్లుగా లష్కర్​కు వచ్చి ప్రజలను ఆశీర్వదిస్తున్నావు. ఈ ఏడాది 16 రోజులుగా జాతర జరిపించుకున్నావు. నీ ఆశీర్వాదం ఇవ్వు తల్లి

సమాధానం: 'ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. నన్ను కొలిచి నిండే నిలిచిన మహంకాళి నేను' అని అమ్మవారు బదులిచ్చారు.

ప్రశ్న : బోనాలు మీ పూజలో ప్రత్యేకం బోనాలు ఎవరు, ఎలా జరిపించాలి ?

సమాధానం :ఏ బోనం అయినా, ఎవరు ఎతుకొచ్చినా ఫర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే. వీళ్లు, వాళ్లు తేవాలని సందేహం పెట్టుకోకండి. ఎవరు తెచ్చినా సంతోషంగా అందుకునే బాధ్యత నాది.

ప్రశ్న :వర్షాలు ఎలా కురుస్తాయి? పాడి పంటలు ఎలా ఆశీర్వదిస్తావు? వ్యాధులు లేకుండా ఎలా చూస్తావ్ ?

సమాధానం : కోరినంత వర్షాలు ఉంటాయి. మంచిగా చూసుకుంటాను. మీకు ఎటువంటి లోటు లేదు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండండి. అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్ముకున్న వారిని నేనే కాపాడుకుంటాను.

ప్రశ్న : కోట్ల మంది ప్రజలు నీ దర్శనం చేసుకున్నారు. 48 గంటలు వర్షంలో తడిచి దర్శనం చేసుకున్నారు. నీ తృప్తిని తెలియజేయి తల్లి?

సమాధానం : నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరిపోతులు అవుతారు. దర్శనం కోసం వచ్చే పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను.

వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు - పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి - SECUNDERABAD LASHKAR BONALU 2024

ప్రశ్న : ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా అమ్మ ? నువ్వు ఏం కోరుకుంటున్నావు?

సమాధానం : నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా.. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడిన నా రూపం నేను పెట్టించుకుంటాను. తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటా.

ప్రశ్న : ప్రజలు వ్యాధులు, డయాబెటిస్​తో బాధపడుతున్నారు. వారికి నీ చల్లని చూపు కావాలి

సమాధానం : పాడి పంటలు ఇదివరకు లాగా పండించడం లేదు. మందులు ఎక్కువ వాడుతున్నారు. అందుకే అనారోగ్యం. వాటిని తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయి.

ప్రశ్న : బలి కార్యక్రమం నచ్చిందా అమ్మ ?

సమాధానం : రక్తపాశం ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు. దానితోనే సంతోషపడుతున్నాను.

ప్రశ్న :. భక్తులను ఆదరించి, ఆశీర్వదించు తల్లి

సమాధానం : 'ఈసారి బోనాలను సంతోషంగా ఘనంగా అందుకున్నాను. పిల్లలకు, గర్భిణులకు ఏ ఇబ్బంది రానివ్వను. అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను' అంటూ అమ్మవారు భవిష్యవాని ముగించారు.

బోనాల జాతరలో దొంగల చేతివాటం : భక్తులు బోనాల సమర్పణలో లీనమై ఉంటే జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. భక్తుల రద్దీ లక్ష్యంగా చేసుకుని చైన్​ స్నాచర్లు రెచ్చిపోయారు. ఆలయ పరిధిలో భక్తులు క్యూలైన్​లో ఉన్నవారి నుంచి సెల్​ఫోన్లు, బంగారు అభరణాలు, వాహనాలు అపహరణకు గురయ్యాయి. భక్తులకు చెందిన ఆరు తులాల బంగారం, 20కి పైగా సెల్​ఫోన్లు, రెండు ద్విచర్క వాహనాలను దుండగులు లాక్కెళ్లారు. పలారం బండి ఊరేగింపు సమయంలో తమ సెల్​ఫోన్లు అపహరణకు గురయ్యాయని బాధితులు పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోనాల ఉత్సవాల విధులకు హాజరైన ఓ ఎస్సై ద్విచక్ర వాహనాన్ని సైతం అపహరించారు.

ఉజ్జయిని మహంకాళికి బోనాల శోభ- ఆలయ కథేంటో తెలుసా? రంగం అంటే ఏంటి? - Ujjain Mahankali Bonalu

శివమెత్తిన భాగ్యనగరం - గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం - GOLcONDA BONALU 2024

Last Updated : Jul 22, 2024, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details