Father kills Four year Daughter in Nizamabad : కుమార్తెను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని ఆ పసి పాపపై కనికరం లేకుండా ఆ కిరాతకుడు గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. ఈ హృదయ విదారక దుర్ఘటన నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలంలోని ధర్మోరా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మాక్లూర్ మండల కేంద్రంలోని ధర్మోరా గ్రామానికి చెందిన ఈర్నాల అరుణ్ ఏడాది క్రితం నిజామాబాద్ సుభాశ్ నగర్‌కు చెందిన వీరమ్మ కుమార్తె సునీతను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సునీతకు మొదటి భర్తకు పుట్టిన బిడ్డ లక్కీ(4) అనే చిన్నారి ఉంది.
మొదటి భర్తకు పుట్టిన పాప ఉండొద్దంటూ గొడవ :అరుణ్ వివాహ సమయంలో సునీతతో పాటు లక్కీని కూడా తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో అరుణ్ పాప లక్కీని తన ఇంట్లో వద్దని తరచూ భార్యతో గొడవ పడేవాడు. గత 3 నెలల క్రితం కూడా పాప చేయి విరగ్గొట్టాడు. అప్పటి నుంచి పాపను సునీత నిజామాబాద్‌లోని సుభాశ్‌నగర్‌కు చెందిన ఆమె తల్లి వీరమ్మ దగ్గర ఉంచింది. అయితే బుధవారం సునీత తన కుమార్తెను చూడాలని భర్తకు చెప్పడంతో అందుకు అరుణ్ నిజామాబాద్ నుంచి పాపను తీసుకుని ధర్మోరా వెళ్లాడు.