ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతికి మరిన్ని రైళ్లు - శ్రీకాకుళంకి స్పెషల్ - SANKRANTI SPECIAL TRAINS

సంక్రాంతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్​ ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే

Sankranti Special trains
Sankranti Special trains (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 10:04 PM IST

Sankranti Special Trains: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌ మధ్య ఆరు స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 11, 12, 15, 16వ తేదీల్లో కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్‌ మధ్య ఈ ట్రైన్స్​ రాకపోకలు సాగించనున్నాయి. అదే విధంగా చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డుకు 8, 9వ తేదీల్లో రెండు ట్రైన్స్ నడుస్తున్నాయి.

ట్రైన్ల వివరాలు ఇవే:

  • 07615 - కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్‌ వరకూ స్పెషల్ ట్రైన్ జనవరి 11, 15వ తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు స్టార్ట్ అయి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది.
  • 07616 - జనవరి 12, 16వ తేదీల్లో తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్‌ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు స్టార్ట్ అయి మరుసటి రోజు ఉదయం 7.35 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
  • ఈ ట్రైన్ మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు రైల్వే స్టేషన్లలో ఆగనున్నట్లు ప్రకటించారు. ఈ ట్రైనులో అన్నీ థర్డ్‌ ఏసీ కోచ్‌లే ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్‌ ప్రకటించారు.
  • 07617 - మరో ట్రైను చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌ వరకూ స్పెషల్ ట్రైన్ జనవరి 8వ తేదీన చర్లపల్లిలో రాత్రి 7.20 గంటలకు స్టార్ట్ ్యి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు స్టేషన్​కు చేరుకోనుంది.
  • 07618 - అదే ట్రైన్ తిరుగుప్రయాణంలో శ్రీకాకుళం రోడ్‌ నుంచి చర్లపల్లి వరకూ జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీకాకుళంలో స్టార్ట్ మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ ట్రైన్​లో ఫస్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు సైతం ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
  • ఈ ట్రైన్​ నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు రైల్వే స్టేషన్లలో ఆగనున్నట్లు తెలిపారు.
Sankranti Special trains (ETV Bharat)

దక్షిణ మధ్య రైల్వే బంపర్​ ఆఫర్ - సంక్రాంతికి మరో 52 ప్రత్యేక రైళ్లు! - బుకింగ్ ఓపెన్

ABOUT THE AUTHOR

...view details