ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మురుగు'తున్న ఆటోనగర్- నెలల తరబడి పేరుకుపోయిన వ్యర్థాలతో స్థానికుల అవస్థలు - పారిశుద్ధ్య సమస్య

Sanitation Problem at Vijayawada Auto Nagar: బెజవాడలోని ఆటోనగర్​ ప్రజలను పారిశుద్ధ్య సమస్య వెంటాడుతోంది. చెత్త, మురుగు కాలువల నిర్వాహణను అధికారులు గాలికొదిలేయటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు.

Sanitation_Problem_at_Vijayawada_Auto_Nagar
Sanitation_Problem_at_Vijayawada_Auto_Nagar

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 12:55 PM IST

Sanitation Problem at Vijayawada Auto Nagar: బెజవాడలో ఆటోనగర్ సమస్యలతో సతమతమౌతోంది. నెలల తరబడి పేరుకుపోయిన చెత్త, మురుగు నిల్వలతో ఆటోనగర్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోనగర్‌లో చెత్త, మురుగు కాలువల నిర్వాహణను అధికారులు గాలికొదిలేయటంతో కాలుష్యకాసారంగా మారింది. రోడ్డుపై మురుగు నిల్వలు, చెత్త పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేరని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మహానగరంలో మురుగు సమస్య - బెజవాడ అభివృద్ధికి బ్రేకులు

విజయవాడలోని ఆటోనగర్ ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది పారిశుద్ధ్యం. ఇక్కడ మూడంకెల సంఖ్యలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఐలాతో పాటు, ఏపీఐఐసీ పర్యవేక్షణ కొరవటంతో కొన్నాళ్లుగా పారిశుద్ధ్య సమస్య ఆటోనగర్​ని వేధిస్తోంది. దీనివల్ల తరచూ రోగాలబారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డంపింగ్ యార్డును తలపిస్తున్న ధవళేశ్వరం- పట్టించుకోండి మహాప్రభో!

గుంటతిప్ప కాలువ పక్కనే ఉన్న రహదారి పరిస్థితి దారుణంగా తయారైంది. కాలువ మురుగును రోడ్డు మీద వేసిన పారిశుద్ధ్య సిబ్బంది ఆ చెత్తను తొలగించలేదు. నెలల తరబడి రోడ్డుపై చెత్త తొలగించకుండా పారిశుద్ధ్య సిబ్బంది చోద్యం చూస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డుపై పేరుకు పోయిన చెత్తతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానిక కార్మికులు చెబుతున్నారు. నెలల తరబడి చెత్త నిల్వ ఉండటంతో దోమలు బెదడ, తీవ్ర దుర్గంధం వెలువడుతుందని స్థానికులు తెలిపారు.

UnderGround Drainage Works: ఏపీలో పడకేసిన పారిశుద్ధ్యం.. యూజీడీకి మంగళం పాడేసిన వైసీపీ సర్కార్..

కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవటంతో స్థానికంగా పనిచేస్తున్న కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొన్ని చోట్ల వర్షాలు పడేటప్పుడు వ్యర్థ జలాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇనుము, రాగి తీగల కోసం చెత్త ఏరుకునే వారు చెత్తకు నిప్పు పెట్టటంతో పొగ కమ్మేస్తుందని స్థానికులు వాపోయారు.

"బెజవాడలోని మా ఆటోనగర్ ప్రాంతం కాలుష్యానికి కాసారంగా మారింది. నెలల తరబడి పేరుకుపోయిన చెత్త, మురుగు నిల్వలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చెత్త, మురుగు కాలువల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. గుంటతిప్ప కాలువ పక్కనే ఉన్న రహదారి పరిస్థితి దారుణంగా తయారైంది. కాలువ మురుగును రోడ్డు మీద వేసిన పారిశుద్ధ్య సిబ్బంది ఆ చెత్తను తొలగించలేదు. నెలల తరబడి రోడ్డుపై చెత్త తొలగించకుండా పారిశుద్ధ్య సిబ్బంది చోద్యం చూస్తున్నారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ప్రయోజనం లేదు." - స్థానికులు

ఏళ్ల తరబడి వెంటాడుతున్న పారిశుద్ధ్య సమస్య

ABOUT THE AUTHOR

...view details