Sandhya Theatre Management Answer to Police Notice :ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి థియేటర్ మేనేజ్మెంట్కు పోలీసులు నోటీసులను ఇచ్చారు. సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులకు థియేటర్ యాజమాన్యం సమాధానం పంపింది.
డిసెంబరు 4న పుష్ప-2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని పోలీసులకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. డిసెంబరు 4, 5న సినిమా థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుందని తెలిపింది. సినిమాల రిలీజ్‌లకు గతంలోనూ హీరోలు థియేటర్నకు వచ్చినట్లుగా వివరించింది. సంధ్య థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్ ఉందని సంధ్య థియేటర్ యాజమాన్యం అని తెలిపింది. ఈ మేరకు ఈ వివరాలన్నింటితో కూడిన 6 పేజీల లేఖను సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపింది.