ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారులకు వరద కష్టం - రాష్ట్రవ్యాప్తంగా 5,921 కి.మీ. ధ్వంసం - Roads Destroyed in ap - ROADS DESTROYED IN AP

Roads destroyed by rains and floods in AP : రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలు, వరదలకు రహదారులైతే రూపురేఖలు కోల్పోయాయి. రహదారులపై వరద ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల కోతకు గురయ్యాయి. మరి కొన్ని చోట్ల ముక్కలు ముక్కలుగా కొట్టుకుపోయాయి. దారులు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ROADS DESTROYED IN AP
ROADS DESTROYED IN AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 9:37 AM IST

Roads Destroyed by Rains and Floods in AP :ఇటీవలి వర్షాలు, వరదలకు రాష్ట్రంలో రోడ్లు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు కలిపి మొత్తంగా 5,921 కిలోమీటర్ల మేర పాడైపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

రహదారులకు వరద కష్టం - రాష్ట్రవ్యాప్తంగా 5,921 కి.మీ. ధ్వంసం (ETV Bharat)
పెద్ద ఎత్తున ధ్వంసమైన రోడ్లు :రాష్ట్రంలో వర్షాలు, వరదలకు రోడ్లు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ప్రస్తుతం తాత్కాలికంగా వీటిని పునరుద్ధరించినా పూర్తిస్థాయిలో పునర్నిర్మించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,567 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు,558 కిలోమీటర్ల మేర పట్టణ రహదారులు పాడయ్యాయి. గ్రామీణరోడ్లు 1642 కిలోమీటర్లు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

బుడమేరు కన్నీరు - సర్వం తుడిచి పెట్టేసిందని ఘొల్లుమంటున్న బాధితులు - Home Appliances damage

5,921 కి.మీ. రోడ్లు ధ్వంసం :మొత్తం 73 చోట్ల రోడ్లు తెగిపోయాయి. 215 చోట్ల రహదారులకు కోతలు పడ్డాయి. 51 ప్రాంతాల్లో భారీ వృక్షాలు రోడ్లపై పడ్డాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇటీవలి వర్షాలు, వరదలకు 5921 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రహదారులు, భవనాల శాఖ అధికారులు వెల్లడించారు. అధిక వర్షాలకు దెబ్బతిన్న రహదారులపై గుంతలు పూడ్చేందుకు రూ. 500 కోట్లు అవసరమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి మరమ్మతులు ప్రారంభిస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం రోడ్లుకు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేసింది. అవి ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లులపై పెద్ద గుంతలు ఏర్పాడ్డాయి. దెబ్బతిన్న గుంతలు పూడ్చేందుకు రూ.500 కోట్లుతో అధికారులు అంచనా వేశారు. వర్షాలు తగ్గి తర్వాత యుద్ధప్రతిపాదికన రోడ్లు మరమ్మతులు చేస్తాం- బీసీ జనార్థన్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి

ముగింపు దశకు చేరిన పునరుద్ధరణ పనులు - నేడు విజయవాడలో కేంద్ర వైద్య బృందం పర్యటన - Vijayawada Gradually Recovering

రూ.500 కోట్ల అవసరం :ప్రధానంగా బుడమేరు వరదతో విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్​ జిల్లాలో రహదారులు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయిన చోట్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలకు ఏర్పాట్లు చేసినా తక్షణం వాటిని పునరుద్ధరించాల్సి ఉంది.

భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి - జలాశయాలకు పోటెత్తుతున్న వరద - HEAVY RAINS IN UTTARANDRA

ABOUT THE AUTHOR

...view details