ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరుగురు మృతి- తొమ్మిది మందికి తీవ్ర గాయాలు- రక్తమొడిన రహదారులు - Road Accidents in AP six Died - ROAD ACCIDENTS IN AP SIX DIED

Road Accidents in Andhra Pradesh Six Died : రాష్ట్ర వ్యాప్తంగా ఘోర రోడ్డు ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ఘనటనల్లో ఆరుగురు మరణించగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారు జామున జరిగిన ఘటనల్లో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

road_accidents_in_andhra_pradesh_six_died
road_accidents_in_andhra_pradesh_six_died (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 2:30 PM IST

ఆరుగురు మృతి- తొమ్మిది మందికి తీవ్ర గాయాలు- రక్తమొడిన రహదారులు (ETV Bharat)

Road Accidents in Andhra Pradesh Six Died : రాష్ట్రవ్యాప్తంగా ఘోర రోడ్డు ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ఘనటనల్లో ఆరుగురు మరణించగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారు జామున జరిగిన ఘటనల్లో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

Car Hits Lorry At Anantapur District :హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్న కారు అనంతపురం జిల్లా బాచుపల్లి వద్ద లారీని ఢీ కొట్టింది. అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. మృతులు అనంతపురం రాణినగర్ కు చెందిన మహ్మద్ అయాన్, మహ్మద్ అమాన్, షేక్‌ ఫిరోజ్‌, ఆలి సాహెబ్‌, రెహానా గా గుర్తించారు.

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం జాతీయ రాహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనటంతో డ్రైవర్‌తో సహా ఏడుగురికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాపట్ల కాజుపాలెంకు చెందిన వీరంతా బ్రహ్మంగారిమఠం, ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులకు మెడికల్ విద్యార్థి సుకన్య ప్రాథమిక చికిత్స అందించి 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొడవలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జైపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి - ఆరుగురికి తీవ్ర గాయాలు - Road Accident In Jaipur

Lorry Rams into House in Muddanur :వైఎస్సార్​ జిల్లా ముద్దనూరులోని ఓ ఇంట్లోకి సిమెంటు లోడ్ లారీ దూసుకెళ్లింది. శుక్రవారం అర్థరాత్రి ముద్దనూరు వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావటంతో రైల్వే గేటు సమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లింది. అప్పటివరకు ఆ ఇంటి ఆరవణలో ఉన్న మహిళ రైల్వే గేటు ధ్వంసం శబ్ధం విని లోపలికి వెళ్లిపోవటంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లోకి లారీ దూసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. గతంలోనూ ఇదే తరహా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

హైవేపై వరుసగా ఢీకొన్న కార్లు- ప్రయాణికులు సేఫ్ - Road Accident in NTR District

పల్నాడు జిల్లాలో బస్సు-టిప్పర్‌ ఢీ - ఆరుగురు దుర్మరణం - PALNADU ROAD ACCIDENT TODAY

ABOUT THE AUTHOR

...view details