Road Accident in Suryapet Today : సూర్యాపేటలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం వ్యవధిలోనే ఈ ప్రాంత సమీపవాసులు 14 మందిని రోడ్డు ప్రమాదాలు(Road Accidents in Telangana) బలిగొన్నాయి. తాజాగా సూర్యాపేట-ఖమ్మం క్రాస్ రోడ్డు ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :మరికొద్ది రోజుల్లో న్యూజిలాండ్ వెళ్లాల్సి ఉన్న నవీద్ అనే యువకుడు స్నేహితులకు రంజాన్ పర్వదినం సందర్భంగా విందును ఏర్పాటు చేశాడు. పార్టీ ముగించుకుని వస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా సూర్యాపేట-ఖమ్మం ఫ్లైఓవర్‌పై వెళుతున్న డీసీఎంను వెనకనుంచి వారి కారు బలంగా ఢీ (Car Hits a Van in Suryapet) కొట్టింది. ఆ సమయంలో కారులో నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.
సుక్క పడిందంటే ప్రతి ఒక్కడూ రైడరే.. రోడ్డెక్కి ఏ బండికో గుద్దుడు ఖాయమే.. ఏం చేసేది మరి?