ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో పుట్టినరోజు వేళ విషాదం - రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి - ROAD ACCIDENT IN AP - ROAD ACCIDENT IN AP

Road Accident In Konaseema District :ఆదివారం అర్థరాత్రి వేర్వేరు జిల్లాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కోనసీమ జిల్లాలో పుట్టిన రోజు వేడుకలు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా లారీని ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో తిరుపతి నుంచి కోదాడ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Road_Accident_In_Konaseema_District
Road_Accident_In_Konaseema_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 10:26 AM IST

Road Accident in Konaseema District : కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. క్షతగాత్రులు మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

కోనసీమలో పుట్టినరోజు వేళ విషాదం - రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ఎన్టీఆర్​ జిల్లాలో స్కూల్ బస్సు-బైక్​ ఢీ - ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు - TODAY ACCIDENTS IN AP

ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి : పుట్టినరోజు వేడుకల కోసం ఆదివారం ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు. వేడుకలు పూర్తి చేసుకున్న అనంతరం పాశర్లపూడికి ఆటోలో తిరిగి వస్తుండగా భట్నవిల్లి వద్ద లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సర్కిల్ ఇన్​స్పెక్టర్​ వీరబాబు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురిని కోనసీమ జిల్లా నగరం గ్రామ వాసులు, ఒకరిని పి.గన్నవరం మండలం మానేపల్లి వాసిగా గుర్తించారు.

రాష్ట్రంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు - ఇద్దరు మృతి - ROAD ACCIDENTS IN AP

Telangana RTC Bus Burned In Prakasam District : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆదివారం అర్థరాత్రి తిరుపతి నుంచి కోదాడ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్​కు అనుమానం రావడంతో బస్సును పక్కకు నిలిపి పరిశీలించగా ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుంచి కిందకి దించారు. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు, ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దగ్ధం అయింది. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బస్సు ప్రమాదానికి గురవటంతో ప్రయాణికులు అర్ధరాత్రి వరకు వేరే బస్సు కోసం వేచి చూసి ఇబ్బందులకు గురయ్యారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి - ఐదుగురి పరిస్థితి విషమం - ROAD ACCIDENT IN ANDHRA PRADESH

Jeep Hit Lorry inGuntur: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని జీపు ఢీకొనటంతో అందులో ప్రయాణిస్తున్న పది మంది తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితులు ప్రత్తిపాడు మండలం గణికపూడి వాసులుగా గుర్తించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details