ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల వద్ద లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి - బయటపడ్డ ఫోన్‌ రికార్డింగ్​లు - REVENUE OFFICER AUDIO RECORDINGS

భూసమస్యల పరిష్కారానికి లంచాలివ్వాలని రెవెన్యూ అధికారుల డిమాండ్ - కలెక్టర్‌కు రెవెన్యూ అధికారి ఫోన్‌ రికార్డింగ్‌ వినిపించిన బాధితుడు

Revenue Officer Demands Bribe From Farmers To Resolve Land Issues
Revenue Officer Demands Bribe From Farmers To Resolve Land Issues (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2025, 7:00 AM IST

Updated : Jan 5, 2025, 12:03 PM IST

Revenue Officer Demands Bribe From Farmers To Resolve Land Issues : భూసమస్యల పరిష్కారానికి లంచమివ్వాలంటూ రెవెన్యూ అధికారులు రైతుల్ని పీడిస్తున్న వైనం ప్రకాశం జిల్లా కనిగిరిలో వెలుగుచూసింది. కనిగిరి మండలం పునుగోడు పంచాయతీలో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతోపాటు MLA ఉగ్రనరసింహారెడ్డి హాజరయ్యారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూసమస్యలను కలెక్టర్‌కు అర్జీల రూపంలో అందజేశారు. తహసీల్దారుపై అనేక ఫిర్యాదులు అందాయి. మ్యుటేషన్‌ కోసం రెండున్నర లక్షలు చెల్లించాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ రైతు ఫిర్యాదు చేశారు.

రెవెన్యూ అధికారి తన కుమారుడితో మాట్లాడిన ఫోన్‌ రికార్డింగును కలెక్టర్‌కు వినిపించారు. ఈ విషయంపై ఆగ్రహించిన కలెక్టర్‌ రైతుల అర్జీల స్థితిగతులను వెంటనే చూపించాలని తహసీల్దారు అశోక్‌కుమార్ రెడ్డిని అడగ్గా ఆయన నీళ్లు నమిలారు. రెవెన్యూ సదస్సుల్లో సంబంధింత రెవెన్యూ రికార్డులు లేకుండా ఎలా వస్తారని తహసీల్దారుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సక్రమ నివేదిక ఇవ్వాలని అక్కడే ఉన్న ఆర్డీవోను ఆదేశించారు.

రైతుల వద్ద లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి (ETV Bharat)
Last Updated : Jan 5, 2025, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details