Fishermen Fishing With Aila Nets in Suryalanka Coast : బాపట్ల సమీపంలో ఉన్న సూర్యలంక తీరంలో 'ఐలా' వలలతో చేపల వేట సందడి మొదలైంది. ఈ ఐలా వల పొడవు కిలోమీటరు వరకు ఉండి ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ చేస్తుంది. ఇలాంటి వలలతో వేట సాగించడం సూర్యలంక తీరం ప్రత్యేకత. ఈ ఒక్కో వలపై దాదాపు 200 నుంచి 250 మంది మత్స్యకారులు ఆధారపడతారు. ప్రధానంగా పక్కె, మత్తి చేపలు ఈ వలలో చిక్కుకుంటాయి. ఈ భారీ ఐలా వలను మొదట 70 నుంచి 80 మంది మత్స్యకారులు మోసి వేట పడవలో ఉంచుతారు. అనంతరం సముద్రంలో రెండు నుంచి ఐదు కి.మీ.దూరం వరకు తీసుకెళ్లి నేర్పుగా వేట సాగిస్తారు.
ఈ ఐలా వలను ఒక్కసారి సముద్రంలో వేస్తే కనిష్ఠంగా 5 నుంచి గరిష్ఠంగా 50 టన్నుల వరకు చేపలు పడతాయి. చేపల వేట కోసం సముద్రంలో వేసిన వలను బయటకు లాగటానికి సైతం ఇతర ప్రాంతాల నుంచి మరో 150 మంది కూలీలను తెచ్చుకుంటారు. అనంతరం ఆ చేపలను తీరంలో కుప్పలుగా పోసి వ్యాపారులకు విక్రయిస్తారు. ఈ చేపలను కొన్న వ్యాపారులు వీటిని తమిళనాడు,కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం ఆరంభంలోనే మత్స్యకారులు గంగమ్మకు పూజలు చేసి 'ఐలా' వలలతో చేపల వేటను ప్రారంభించారు.
వాటర్ బాటిల్ ఉంటే చాలు - కిలోల కొద్దీ చేపలు పట్టొచ్చు - ఎలాగంటే !
కాకినాడ మత్స్యకారులకు చిక్కిన బాహుబలి చేప - Fishermen Caught Big Fish