ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆందోళన అవసరం లేదు - ప్రవాహం తగ్గిన తర్వాత కౌంటర్‌ వెయిట్‌కు మరమ్మతులు: కన్నయ్య నాయుడు - Prakasam Barrage Flood Flow - PRAKASAM BARRAGE FLOOD FLOW

Prakasam Barrage Floods 2024 : ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. ఎన్నడూ లేనతంగా రికార్డు స్థాయిలో ప్రవాహం కొనసాగింది. వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యసాధ్యాలపై, అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరులశాఖ సలహాదారు కన్నయ్యనాయుడిని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకువచ్చారు. ఇరుక్కుపోయిన బోట్లు, బ్యారేజి పటిష్టతను కన్నయ్యనాయుడు పరిశీలించారు.

Flood Alert at Prakasam Barrage
Flood Alert at Prakasam Barrage (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 10:23 AM IST

Updated : Sep 2, 2024, 10:02 PM IST

Boats Stuck in Prakasam Barrage : రెండు రోజులుగా కురిసిన వర్షాలకు విజయవాడకు వరద పోటెత్తింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు. మరోవైపు బ్యారేజ్‌ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రజలు, వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వరదను చూసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో వాహనాల రద్దీ కూడా పెరిగింది. ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజ్ వైపు ఎవరినీ అనుమతించడం లేదు.

Hydro Mechanical Engineer kannaiah Naidu to Prakasam Barrage :ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. ఈ నాలుగు బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్‌ పాక్షికంగా దెబ్బతింది. నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యసాధ్యాలపై, అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరులశాఖ సలహాదారు కన్నయ్యనాయుడిని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకువచ్చారు. ఇరుక్కుపోయిన బోట్లు, బ్యారేజి పటిష్టతను కన్నయ్యనాయుడు పరిశీలించారు.

ప్రకాశం బ్యారేజీలో పడవలు ఢీకొని ఓ గేటుకు సంబంధించి కౌంటర్‌ వెయిట్‌ ధ్వంసమైన ఘటనలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన తర్వాత కౌంటర్‌ వెయిట్‌కు మరమ్మతులు చేస్తాం. -కన్నయ్యనాయుడు, జలవనరులశాఖ సలహాదారు

Prakasam Barrage Gates Lifted : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మొత్తం 70 గేట్లను ఎత్తి 11.38 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 24.3 అడుగుల మేర కొనసాగుతోంది. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే వరద ఉద్ధృతి గంటగంటకూ తగ్గుముఖం పడుతోంది.

ఆల్మట్టి నుంచి ప్రకాశం వరకు కృష్ణమ్మ పరుగులు - నిండుకుండల్లా జలాశయాలు - Prakasam Barrage Overflowing

Flood Alert at Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదలతో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. యనమలకుదురు సమీపంలో రక్షణగోడకు సమాతరంగా వరద ప్రవహిస్తోంది. రక్షణగోడకు పైబడి నీరు ప్రవహిస్తే పలు కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు.

'మాకు ఈసారీ వరద ముప్పు తప్పేలా లేదు' - గత అనుభవాలతో బెంబేలెత్తుతున్న దివిసీమ ప్రజలు - Flood Threat in Diviseema

Last Updated : Sep 2, 2024, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details