ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుచి అదుర్స్​ - రూపం బెదుర్స్​!

కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన 8 అడుగుల ఈల్​

Rare_Fish_Caught_Fisherman
Rare_Fish_Caught_Fisherman (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Rare Fish Caught Fisherman Net in Kakinada Coastal Area :ఎవరైనా పాము చూస్తే ఆమడ దూరం వరకు పరుగులు పెడతాము. కానీ ఈ మహిళలో ఎంత ధైర్యంతో చేతిలో పట్టుకుంది అని ఆలోచిస్తున్నారా? అలా అనుకుంటే పొరపాటే! ఆమె పట్టుకున్నంది పామును కాదండి. ఓ రకమైన చేపను. చేప ఏంటి పాములా అని అనుకుంటున్నారా? అవును అది చేపే. సముద్రంలో పెరిగే ఈల్​ జాతికి చెందిన చేపలు సాధారణంగా 3 నుంచి 4 అడుగుల వరకు పెరుగుతాయి. వీటిని మత్స్యకారులు నల్ల బొమ్మిడాయి అంటారు. కానీ శుక్రవారం (అక్టోబర్​ 25న) కాకినాడ సముద్రం తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు మాత్రం 8 అడుగుల నల్ల బొమ్మిడాయి చిక్కింది. ఇవి తినడానికి ఎంతో రుచి ఉంటుంది. ఇది పాములా ఉండటంతో కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తిని చూపరని మత్స్యకారులు తెలియజేశారు. అందుకే వీటిని ఎండబెట్టి ఎగుమతి చేస్తామని తెలిపారు. కుంభాభిషేకం చేపల రేవు వద్ద 50 కిలోల ఈల్​ చేపలను రూ. 5000 విక్రయించారు.

ABOUT THE AUTHOR

...view details