Rape Incident in Telangana : మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు, వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు కొందరు కీచకులు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటున్నా, నేరాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన మరో రెండు దారుణాలు బాధితుల ఫిర్యాదులతో వెలుగుచూశాయి.
కదులుతున్న బస్సులో మహిళపై రేప్:కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెలుతున్న మహిళపై ఆఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా మహిళ ఫిర్యాదుతో, అప్రమత్తమైన సిటీ పోలీస్. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. కాగా డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మరో డ్రైవర్ సిద్దయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై స్నేహితుల అత్యాచారం : హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన సైతం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై స్నేహితుడు అత్యాచారం చేసిన ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ హోటల్‌కు వెళ్లారు.