తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫస్ట్​ ఇయర్​లో రంగారెడ్డి - సెకండ్ ఇయర్​లో ములుగు - 'ఇంటర్​'లో ఈ జిల్లా విద్యార్థులే టాపర్స్ - TS INTERMEDIATE TOPPERS 2024 - TS INTERMEDIATE TOPPERS 2024

Telangana Intermediate Results Released 2024 : రాష్ట్రంలో ఇంటర్​ ఫలితాలను బోర్డు విడుదల చేసింది. మొదటి సంవత్సరంలో 60.01 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ద్వితీయ సంవత్సరంలో 64.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్​ ఇయర్​లో అత్యధిక పాస్​ పర్సంటేజీతో రంగారెడ్డి జిల్లా ఫస్ట్​ ప్లేస్​లో నిలవగా, సెకండ్​ ఇయర్​ రిజల్ట్స్​లో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

TS INTER RESULTS 2024
TS Inter Results 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 12:40 PM IST

TS Inter Results Released 2024 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 9.81 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బోర్డు ఒకేసారి విడుదల చేసింది. ఫస్ట్​ ఇయర్​లో 60.01 శాతం మంది విద్యార్థులు పాసవగా, సెకండ్ ఇయర్​లో 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలురపై బాలికలు మరోసారి పైచేయి సాధించారు.

మొత్తంగా ప్రథమ సంవత్సర ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మేడ్చల్-మల్కాజిగిరి​ జిల్లా ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ములుగు జిల్లా ప్రథమ స్థానం సాధించగా, మేడ్చల్-మల్కాజిగిరి​ జిల్లా సెకండ్​ ప్లేస్​లో నిలిచినట్లు విద్యా శాఖ వెల్లడించింది.

ఇంటర్​ ఫలితాలు 2024​ విడుదల - రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి - TS INTER RESULTS RELEASED 2024

ఫస్ట్​ ఇయర్​ రిజల్ట్స్​ వివరాలు :

  • ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4.78 లక్షల మంది పరీక్షలకు హాజరు
  • ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 2.87 లక్షల మంది విద్యార్థుల ఉత్తీర్ణత
  • ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షల్లో 60.01 శాతం ఉత్తీర్ణత
  • ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 68.35 శాతం బాలికల ఉత్తీర్ణత
  • ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో 51.5 శాతం బాలురు ఉత్తీర్ణత
  • ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా
  • ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ద్వితీయ స్థానంలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా

సెకండ్​ ఇయర్​ రిజల్ట్స్​ వివరాలు :

  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 5.3 లక్షల మంది పరీక్షలకు హాజరు
  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 3.22 లక్షల మంది విద్యార్థుల ఉత్తీర్ణత
  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో 64.19 శాతం ఉత్తీర్ణత
  • ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో 72.53 శాతం బాలికల ఉత్తీర్ణత
  • ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో 56.1 శాతం బాలురు ఉత్తీర్ణత
  • ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో ప్రథమస్థానంలో ములుగు జిల్లా
  • ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో ద్వితీయస్థానంలో మేడ్చల్‌ జిల్లా

ఇప్పటికీ రిజల్ట్స్​ చూసుకోని వారు ఎవరైనా ఉంటే, కింది లింకులపై క్లిక్​ చేసి క్షణాల్లో మీ ఫలితాలను తెలుసుకోండి.

ఏపీ ఇంటర్​ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా - ap Inter Results 2024

రిజల్ట్స్ వచ్చేశాయ్ - పదో తరగతి ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి - AP SSC Results Released 2024

ABOUT THE AUTHOR

...view details