Ramzan Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. చిన్నాపెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా రంజాన్ వేడుకలు - భక్తిశ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు Ramzan: రాష్ట్రంలో రంజాన్ సందడి.. ప్రత్యేక ప్రార్థనలు
Chandra Babu, Lokesh Wishes To Muslims: పవిత్రమైన రంజాన్ మాసంలో నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించి, ఈరోజు పండుగజరుపుకుంటున్న ముస్లింలందరికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనందం, ఐశ్వర్యాలను అల్లా ప్రసాదించాలని కోరుకున్నట్టు బాబు తెలిపారు. ముస్లిం మైనారిటీలకు నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుపుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య రంజాన్ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచారు. కర్నూలు కొత్త బస్టాండ్ వద్దనున్న ఈద్గాలో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్, ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ ముస్లింలతో కలసి ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.
Ramzan: రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. హాజరైన రాజకీయ నేతలు
Visakhapatnam District: విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం తాహ మసీదులో ఎమ్మెల్యే గణబాబు ముస్లిం సోదరుల ప్రార్థనలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రతకు మారుపేరు రంజాన్ పండుగనే సర్వమత సమ్మేళనంతో భారతదేశంలో అందరూ అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నారని గణబాబు అన్నారు.
కోనసీమలో రంజాన్ వేడుకలు: బుధవారం రాత్రి నెలవంక దర్శనంతో ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ ముగిసింది. నెల రోజుల ఉపవాసాల అనంతరం కొత్తపేట నియోజకవర్గంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను గురువారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మత గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. రంజాన్ పండుగనుపురస్కరించుకొని కొత్త దుస్తులు ధరించి చిన్నా పెద్దా అందరూ మసీదులకు చేరుకున్నారు.
Satyasai District: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపూర్ పట్టణంలో ఆల్ హీలాల్ ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు అంతా ఒక చోట చేరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక అధికార, తెలుగుదేశం పార్టీలకు చెందిన నాయకులు ఈద్గా వద్దకు తరలివచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా రంజాన్.. కిక్కిరిసిన ప్రార్థనా మందిరాలు.. వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
నంద్యాల జిల్లా: నంద్యాలలో అల్పూర్ ఖాన్ ఈద్గాతో పాటు పలు ఈద్గాల్లో ముస్లింలు ప్రార్ధనలు నిర్వహించారు. నంద్యాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ కార్యదర్శి ఫిరోజ్, అధికార పార్టీ నేతలు ఈద్గాలో ప్రార్థనలు చేసి ఈద్ ముబారక్ చెబుతూ ప్రేమ ఆప్యాయతలతో పలకరించారు.
అనంతపురం: ముస్లిం సోదరులతో ప్రార్థనలో పాల్లొన్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నెల రోజుల కఠోర ఉపవాస దీక్షలు చేసి భగవంతుని ధ్యాసలో ఉండి పండుగను జరుపుకోవడం చాలా సంతోషమని పేర్కొన్నారు. ముస్లిం మత పెద్ద ఆధ్వర్యంలో రంజాన్ పండుగ విశేషాలను తెలియజేస్తూ ఖురాన్లో ఉన్న అంశాలను వివరిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.