ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా రామోజీరావు సంస్మరణ సభ - హాజరైన ప్రముఖులు - Ramoji Rao Memorial Program - RAMOJI RAO MEMORIAL PROGRAM

Ramoji Rao Memorial Meet in Vijayawada : రామోజీరావు సంస్మరణ సభను ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రముఖలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Ramoji Rao Memorial Program in Kanuru
Ramoji Rao Memorial Program in Kanuru (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 5:18 PM IST

Updated : Jun 27, 2024, 10:54 PM IST

Ramoji Rao Memorial Program in Kanuru : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరులో రామోజీరావు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సంస్మరణ సభకు అతిరథ మహారథులు హాజరయ్యారు. రామోజీరావు కుటుంబ సభ్యులతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్, మనోహర్‌, సత్యకుమార్‌, కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు.

అదేవిధంగా రాజస్థాన్ పత్రిక అధినేత గులాబ్ కొఠారి, ప్రముఖ పాత్రికేయుడు ఎన్‌. రామ్‌ పాల్గొన్నారు. సినీ ప్రముఖులు మురళీమోహన్, జయసుధ, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అశ్వినీదత్‌, ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి సురేష్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తిలకించారు. వేదిక వద్ద రామోజీరావుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు.

Ramoji Rao Memorial Meet in Vijayawada :ఈ సందర్భంగా అన్యాయాలు, అక్రమాలపై అక్షరాలను అంకుశంలా ప్రయోగించి ఆరోగ్యకర సమాజ స్థాపనకు నిర్విరామంగా కృషిసల్పిన పాత్రికేయ శిఖరం రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివందనం సమర్పించింది. మీడియా స్వేచ్ఛ కోసం నిరంతరం శ్రమించిన అక్షరయోధుడికి నీరాజనం పలికింది. తెలుగు జాతిని జాగృతం చేస్తూ చివరి శ్వాస వరకూ ప్రజాసమస్యలే అజెండాగా జీవనం సాగించిన కర్మయోగికి వినమ్ర వందనం సమర్పించింది.

రామోజీరావు ఆశయాలను ఇకపైనా కొనసాగిస్తాం : ఈ క్రమంలోనే రామోజీరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన జీవితాంతం నిక్కచ్చిగా పాటించిన విలువలు, విశ్వసనీయత, క్రమశిక్షణ, రాజీలేని పోరాటాలను వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షలను అదే స్ఫూర్తితో ఇకపైనా కొనసాగిస్తామని నేతలు, కుటుంబ సభ్యులు ప్రకటించారు.

కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగారు. ఈనాడుతోపాటు ఈటీవీ ప్రసారాలతో మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు. ప్రకృతి విపత్తుల్లో ప్రజల వెన్నంటి నిలిచారు. మార్గదర్శితో మధ్యతరగతి ప్రజలకు పొదుపుపై అవగాహన కల్పించారు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా అందించారు. ఆయన నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గిన్నిస్‌ బుక్‌ రికార్డును సొంతం చేసుకుంది.

నమ్మిన విలువల కోసం రామోజీరావు కట్టుబడ్డారు: హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్‌. రామ్‌ - N Ram Comments on Ramoji Rao

ప్రతిష్ఠాత్మకంగా రామోజీరావు సంస్మరణ సభ - ఆకట్టుకుంటున్న ఫొటో ఎగ్జిబిషన్‌ - Ramojirao Photo Exhibition

Last Updated : Jun 27, 2024, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details