తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో ఘనంగా రాములోరి శోభాయాత్రలు - సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామాలయాలు - Ayodhya Pran Pratishtha telangana

Ayodhya Pran Pratishtha Celebrations In Telangana 2024: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. మరోవైపు రామాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పలువురు వినూత్నంగా రామమందిర నామూనాలను తయారు చేసి భక్తిని చాటుకున్నారు.

Ramulori Shobhayatras Celebrations In Telangana
Ramulori Shobhayatras

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 9:01 AM IST

రాష్ట్రంలో ఘనంగా రాములోరి శోభాయాత్రలు - సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామాలయాలు

Ayodhya Pran Pratishtha Celebrations In Telangana 2024 : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల భక్తులుశోభాయాత్రలు నిర్వహించారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు 20 వేల నాణాలతో 10 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పుతో రూపొందించిన అయోధ్య రామ మందిరం చూపరులను ఆకట్టుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఓ యువతి సీతారామాంజనేయస్వామి చిత్రాలను ముగ్గు రూపంలో వేసి అందరి దృష్టి ఆకర్షించింది.

Sri Rama Shobha Yatra In Mahabubnagar :అదే విధంగా రావి ఆకులపై ఆంజనేయుడి ఆకారం, దేవతామూర్తులను తీర్చిదిద్దింది. మహబూబాబాద్ జిల్లాలో రామ భక్తులు పెద్ద ఎత్తున శోభా యాత్రను నిర్వహించారు. నల్గొండ జిల్లా చండూర్‌ మున్సిపాలిటీకి చెందిన ఓ యువతి న్యూస్‌ పేపర్లు, ఫెవికల్‌ సహాయంతో అద్భుతంగా రామ మందిరం నమూనాన్ని తయారు చేసింది. నిర్మల్‌ జిల్లా గాంధీ చౌకుకు చెందిన నరసింహ అట్టముక్కలు, పాత క్యాలెండర్లు, పత్రికలు, కాగితాలతో అబ్బురపడేలా రామమందిరం స్తంభాలు, గోపురాలను తయారు చేశారు.

అయోధ్య రాఘవుడి ప్రాణప్రతిష్ఠ వేళ - భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు

Ayodhya Ram Temple DesignIn Yadadri :యాదాద్రి భువవగిరి జిల్లా మోత్కూర్‌ మున్సిపాలిటీకి చెందిన 12 ఏళ్ల బాలుడు థర్మాకోల్‌ సహాయంతో అయోధ్య రామమందిరాన్ని తీర్చిదిద్దారు. భద్రాచలంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామివారి ఆలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు జయరాం జయరాం అంటూ భక్తులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేశారు. మంథని అయ్యప్ప దేవాలయంలో అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ శివరామకృష్ణ ముగ్గుతో సీతారాములను చిత్రీకరించారు. సిద్దిపేటలో భక్తులు వైభవంగా శ్రీరాముని విగ్రహంతో శోభా యాత్ర చేశారు.

కాజీపేట నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ ఇవే

హైదరాబాద్ తార్నాక ఉస్మానియా యూనివర్శిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. సికింద్రాబాద్‌లోని హనుమాన్ దేవాలయానికి సినీనటి పూనమ్ కౌర్ విచ్చేసి స్వామివారికి మగ్గంపై పట్టు వస్త్రాలు నేశారు. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకను పురస్కరించుకోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో భక్తులు రామనామ సంకీర్తనలు, భక్తిగీతాలు ఆలపిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు కాషాయ జెండాలను పట్టుకోని జైశ్రీరాం అంటూ నినాదాలు చేయడంతో పట్టణమంతా రామనామస్మరణతో మార్మోగింది.

శ్రీరాముడిపై బాలిక 'ఉడతా భక్తి'- అయోధ్య రామమందిరం నిర్మాణానికి రూ.52 లక్షలు సేకరణ

'అయోధ్య అంతా రామమయం'- ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details